అల వైకుంఠపురములో ఇంటి విశేషాలు.. దాని విలువ ఎంతంటే..?

భాగవతంలోని గజేంద్ర మోక్షంలోని ఓ పద్యమైన అల వైకుంఠపురంబులో నగరిలో నా మూల సౌధంబు అంటూ సాగే ఈ పద్యంలో అక్కడి సౌందర్యాన్ని, అక్కడి నిర్మాణాన్ని ఎంతో చక్కగా వివరిస్తాడు పోతన. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. ఎంతో సాహసం చేసి, కొత్తగా ఉండాలని ఆలోచించి అల వైకుంఠపురములో అనే టైటిల్‌ను ఎంచుకున్నాడు. అయితే ఈ టైటిల్ అందరికీ ఎక్కుతుందా? అనే ఆలోచన కూడా వచ్చిందని చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ టైటిల్ ఎంత ఫేమస్ అయిందో.. అందులో కనిపించే ఇళ్లు కూడా అంతే ఫేమస్ అయింది.

 ఇంటి చుట్టే తిరిగే కథ..

ఇంటి చుట్టే తిరిగే కథ..

అల వైకుంఠపురములో అని టైటిల్ పెట్టినప్పుడు దానికి తగ్గట్టు ఓ ఇంటిని కూడా వెతికిపట్టుకోవాల్సి వస్తుంది. ఒకసారి దాన్ని చూస్తే నిజంగానే శ్రీ మహావిష్ణువు ఉండే ఇంటిలా అనిపించాలి. అంతటి సౌందర్యం, అద్భుత నిర్మాణం ఎక్కడ ఉందో కనిపెట్టడం అంటే అంత సులభమేమీ కాదు. అయితే త్రివిక్రమ్ మాత్రం ఎంతో ఈజీగా ఆ ఇంటిని కనిపెట్టేశాడు.

ముగ్దుల్ని చేసే సౌధం..

ముగ్దుల్ని చేసే సౌధం..

అల వైకుంఠపురములో టైటిల్‌లో ఓ ఇళ్లు కనబడుతుంది. సినిమా కూడా ఆ ఇంటి చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఈ సినిమాకు ఇళ్లే కీలకం. 'వైకుంఠపురం రా అది.. అంటాడు మురళీ శర్మ. అంతలా ముగ్దుల్ని చేసే సౌధం కావాలంటే ఆషామాషీ కాదు. అయితే వాటికి సంబంధించిన ఇంటీరియర్ అంతా అన్నపూర్ణలో సెట్ వేశారని తెలుస్తోంది.

ఎన్నో ప్రయత్నాలు..

ఎన్నో ప్రయత్నాలు..

బయట నుంచి కూడా అంతకు అంతా అందమైన ఇల్లు కావాలి. ఎక్కడ దొరుకుతుంది. ముందు కొన్ని విదేశీ లోకేషన్లలో చూశారని టాక్. బయట నుంచి చూపిస్తే చాలు.. ఒకటి రెండు షాట్ లు తీస్తే చాలని భావించారట. ఆఖరికి అలాంటి ఇల్లు హైదరాబాద్ లోనే దొరికింది.

Recommended Video

భార్య స్నేహారెడ్డితో అల్లు అర్జున్ సంక్రాంతి సంబరాలు..!! వీడియో వైరల్
వంద కోట్లతో నిర్మాణం..

వంద కోట్లతో నిర్మాణం..

అయితే ఆ ఇల్లు మరెవరిదో కాదట.. ఓ మీడియా అధినేతకు సంబంధించిన బంధువులదట. వారికి, హారిక హాసిని అధినేతలకు కూడా బంధుత్వం ఉందని, ఆ సంబంధంతోనే ఒకటి రెండు రోజులు బయట నుంచి షూట్ చేయడానికి, సినిమాలో ఆ బంగ్లా చూపించడానికి అనుమతి దొరకిందని తెలుస్తోంది. దాదాపు వంద కోట్లతో కట్టిన ఆ బంగ్లా.. 300కోట్ల విలువ చేస్తుందని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X