twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్.... అమితాబ్ సినిమాల ఆసక్తికర విషయాలు!

    By Bojja Kumar
    |

    1969లో 'సాత్ హిందుస్తానీ' సినిమాతో తెరంగేట్రంచేసిన అమితాబ్ ఇండియన్ సినిమా పరిశ్రమలో అంచెలంచెలుగా ఎదిగారు. భారత దేశం గర్వించదగ్గ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయనకు తాజాగా మరో గౌరవం దక్కింది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(ఐఎఫ్ఎఫ్ఐ) 2017 వేడుకలో ఆయన్ను ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరించారు.

    ఈ సందర్భంగా అమితాబ్ ఇప్పటి వరకు చేసిన సినిమాల గురించి ఓ లుక్కేద్దాం...

    గుర్తింపు లభించని తొలి సినిమా

    గుర్తింపు లభించని తొలి సినిమా

    1969లో ‘సాత్ హిందుస్తానీ' సినిమాతో తెరంగేట్రంచేసిన అమితాబ్ ఈ సినిమాలో ఏడుగురు హీరోల్లో అమితాబ్ ఒకరు. ఏడుగురిలో తనది ఒక పాత్ర కావడంతో నటుడిగా సాత్ హిందుస్థానీ బిగ్ బీకి పేరు తీసుకురాలేదు. ఆ తర్వాత సునీల్ దల్ డైరెక్ట్ చేసి, నిర్మిస్తూ, నటించిన రేష్మ ఔర్ షేరా సినిమాలో అమితాబ్‌కి కీలకమైన పాత్ర చేసే అవకాశం దక్కింది.

    కెరీర్ మలుపు తిప్పిన జంజీర్

    కెరీర్ మలుపు తిప్పిన జంజీర్

    దాదాపు 12 చిత్రాలు భారీ డిజాష్టర్లుగా మిగిలిన తర్వాత అమితాబ్‌ చేసిన జంజీర్ సినిమా సూపర్ హిట్ అయింది. ఇది అతడి కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా. జంజీర్ సినిమా తర్వాత ఇక అమితాబ్‌కు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

    దీవార్ సినిమాతో మంచి గుర్తింపు

    దీవార్ సినిమాతో మంచి గుర్తింపు

    యశ్ చోప్రా దర్శకత్వంలో ఆయన నటించిన దీవార్ సినిమాలోని నటనకు ఫిలింఫేర్ ఉత్తమ నటుడు అవార్డు గెలిచారు అమితాబ్. దీవార్, జంజీర్ సినిమాల్లోని ఆయన పాత్రల వల్ల "యాంగ్రీ యంగ్ మ్యాన్" బిరుదు ఇచ్చారు ప్రేక్షకులు, అభిమానులు.

    భారతీయ సినీ ప్రపంచంలోనే అత్యంత గొప్ప చిత్రం

    భారతీయ సినీ ప్రపంచంలోనే అత్యంత గొప్ప చిత్రం

    1975లో రమేష్ సిప్పీ దర్శకత్వంలో అమితాబ్ నటించిన షోలే సినిమా భారతీయ సినీ ప్రపంచంలోనే అత్యంత గొప్ప చిత్రంగా నిలిచింది. ఈ సినిమా తర్వాత అమితాబ్ స్టార్ ఇమేజ్ మరింత పెరిగిందనే చెప్పొచ్చు.

    వరుస విజయాలు

    వరుస విజయాలు

    1976లో కభీ కభీ, 1977లో అమర్ అక్బర్ ఆంతోనీ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించారు అమితాబ్. అమర్ అక్బర్ ఆంతోనీ సినిమాకు ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారం అందుకున్నారు. 1978లో డాన్ సినిమాలో డాన్, విజయ్ పాత్రల్లో ద్విపాత్రాభినయంతో అభిమానులను ఆకట్టుకున్నారు అమితాబ్.

    విజయవంతమైన చిత్రాలు

    విజయవంతమైన చిత్రాలు

    1980లో అమితాబ్ పలు విజయవంతమైన సినిమాల్లోనటించారు. వాటిలో దోస్తానా, షాన్ మంచి విజయం నమోదు చేసుకున్నాయి. ఆ తరువాత కాలియా (1981), సిల్ సిలా (1981), శక్తి (1982) వంటి సినిమాల్లో చేశారు అమితాబ్. దోస్తానా, శక్తి సినిమాల్లోని నటనకు ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారానికి నామినేషన్లు లభించాయి.

    కూలీ దెబ్బతో ఐదేళ్లు నటనకు దూరమైన అమితాబ్

    కూలీ దెబ్బతో ఐదేళ్లు నటనకు దూరమైన అమితాబ్

    కూలీ (1983) సినిమా సమయంలో తగిలిన తీవ్ర గాయం కారణంగా 5 ఏళ్ళు సినిమాలకు దూరంగా ఉన్నారు అమితాబ్. 5 ఏళ్ళ తరువాత 1988లో ఆయన నటించిన షెహెన్ షా సినిమా మంచి విజయం సాధించింది.

    సినిమా ప్లాప్ అయింది, కానీ....

    సినిమా ప్లాప్ అయింది, కానీ....

    1990లో అగ్నిపథ్ ఫ్లాప్ అయినా ఆ సినిమాకు జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం, ఆ తర్వాత చేసిన హమ్ సినిమాతో ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారం అందుకున్నారు అమితాబ్. విజయం సాధించకపోయినా అగ్నిపథ్ క్లాసిక్ గా నిలిచింది.

    కౌన్ బనేగా కరోడ్‌పతి ప్రారంభం

    కౌన్ బనేగా కరోడ్‌పతి ప్రారంభం

    2000లో ఆయన నటించిన మొహొబ్బతేకు ఫిలింఫేర్ ఉత్తమ సహాయనటుడు పురస్కారం అందుకున్నారు అమితాబ్. అదే సంవత్సరం కౌన్ బనేగా కరోడ్ పతీ షోతో బుల్లితెరకు పరిచయమయ్యారు. ఒక్క మూడో సీజన్ తప్ప ఆ షోలో అన్ని సీజన్లలోనూ ఆయనే వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

    విమర్శకుల ప్రశంసలు

    విమర్శకుల ప్రశంసలు

    2005లో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో చెవిటి, గుడ్డి అమ్మాయికి టీచర్ పాత్రలో ‘బ్లాక్' సినిమాలో ఆయన నటన విమర్శకుల ప్రశంసలు పొందింది. ఈ సినిమాకు జాతీయ, ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారాలు అందుకున్నారు అమితాబ్.

    పా, పికూ చిత్రాలకు జాతీయ ఉత్తమ నటుడు అవార్డులు

    పా, పికూ చిత్రాలకు జాతీయ ఉత్తమ నటుడు అవార్డులు

    2009లో పా సినిమాలోని నటనకూ జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం గెలుచుకున్నారు. 2015లో పీకూ సినిమాలోని నటనకు నాలుగో జాతీయ ఉత్తమ నటుడు పురస్కారాన్ని అందుకున్నారు.

    ప్రస్తుతం అమితాబ్ చేస్తున్న సినిమాలు

    ప్రస్తుతం అమితాబ్ చేస్తున్న సినిమాలు

    ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ 102 నాటౌట్, టగ్స్ ఆఫ్ హిందూస్థాన్ సినిమాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం అమితాబ్ వయసు 75 సంవత్సరాలు. ఇప్పటికీ ఆయన అలుపు లేకుండా ఓ వైపు టీవీ షోలు చేస్తూ సంవత్సరానికి కనీసం 5 సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు.

    English summary
    On November 28, 2017, legendary actor Amitabh Bachchan was conferred with the Indian film personality of the year award winner at the 48th IFFI held in Panaji, Goa.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X