»   » ప్రియాంక చోప్రా 33, హాట్ విషయాలు (ఫోటోస్)

ప్రియాంక చోప్రా 33, హాట్ విషయాలు (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదనుకుంటా. మాజీ ప్రపంచ సుందరి అయిన ప్రియాంక చోప్రా...తాను కేవలం అందగత్తెను మాత్రమే కాదు, నటిని కూడా అని నిరూపించుకుంది. అంతటితో ఆగకుండా ఇంటర్నేషనల్ లెవల్లో పాప్ స్టార్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే పలు ఆల్బమ్స్ కూడా విడుదల చేసింది.

ఈ రోజు ప్రియాంక చోప్రా బర్త్ డే. నేటితో అమ్మడు 33వ వడిలోకి అడుగు పెడుతోంది. ఈ సందర్భంగా ప్రియాంక చోప్రా గురించిన ఆసక్తికర విషయాలపై ఓ లుక్కేద్దాం. ప్రియాంక చోప్రా 1982వ సంవత్సరం జూలై 18వ తేదీన జన్మించింది. మోడలింగ్ పై ఆసక్తితో అటు వైపు అడుగులు వేసిన ప్రియాంక...ఆ తర్వాత ప్రపంచ సుందరి పోటీల వైపు ఆకర్షితురాలైంది.

స్లైడ్ షోలో ప్రియాంక చోప్రా హాట్ ఫోటోలు, వివరాలు...

ప్రియాంక చోప్రా చైల్డ్ హుడ్

ప్రియాంక చోప్రా చైల్డ్ హుడ్


అశోక్ చోప్రా, మధు అఖౌరి వైద్య దంపతులకు జార్ఖండ్‌లోని జమ్‌షెడ్‌పూర్‌లో ప్రియాంక చోప్రా జన్మించింది. చోప్రా తన బాల్యాన్ని ఉత్తర్ ప్రదేశ్‌లోని బరేలిలో, మస్సాచుసెట్ట్స్‌లోని న్యూటన్ ప్రాంతంలో మరియు ఐవాలోని సెదర్ రాపిడ్స్ ప్రాంతంలో గడిపింది. ఆమె తండ్రి సైన్యంలో వైద్యుడు కావటం వలన వారు తరచుగా ప్రాంతాలు మారుతూ ఉండేవారు. ఆమె తండ్రి బరేలీలో స్థిరపడిన పంజాబ్‌కు చెందిన ఖత్రి కుటుంబానికి చెందినవాడు మరియు ఆమె తల్లి జమ్‌షెడ్‌పూర్‌లో స్థిరపడిన మలయాళీ కుటుంబానికి చెందినది. ఆమెకు ఆమెకంటే ఏడు సంవత్సరాలు చిన్నవాడైన సిద్ధార్థ్ అనే తమ్ముడు ఉన్నాడు.

మిస్ ఇండియా టైటిల్

మిస్ ఇండియా టైటిల్


2000 సంవత్సరంలో ప్రియాంక చోప్రా మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకుంది.

ఆ ప్రశ్నకు సమాధానం..

ఆ ప్రశ్నకు సమాధానం..


మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా జడ్జిలు ఆమెను జీవించిన ఉన్న వారిలో గొప్ప మహిళ ఎవరు? అని అడగ్గా....అందుకు సమాధానంగా మధర్ థెరిస్సా పేరు చెప్పింది.

నటనా రంగంలోకి...

నటనా రంగంలోకి...


తమిళంలో 2002 సంవత్సరంలో విజయ్ హీరోగా తెరకెక్కిన చిత్రంతో ప్రియాంక చోప్రా తన నట జీవితం ప్రారంభించింది.

బాలీవుడ్ ఎంట్రీ

బాలీవుడ్ ఎంట్రీ


అనిల్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది హీరో: లవ్ స్టొరీ ఆఫ్ ఎ స్పై' (2003) ద్వారా ఆమె బాలీవుడ్ రంగప్రవేశం చేసింది కానీ అదే సంవత్సరంలో రాజ్ కన్వర్ దర్శకత్వంలో వచ్చిన అందాజ్ చిత్రం ద్వారా ఆమెకు పరిశ్రమలో తొలి విజయం లభించింది.

సింగింగ్ టాలెంట్

సింగింగ్ టాలెంట్


ప్రియాంక చోప్రా వెస్టర్న్ క్లాసికల్ మ్యూజిక్‌లో శిక్షణ పొందింది. ఇప్పటికే రెండు మ్యూజిక్ ఆల్బమ్స్ విడుదల చేసింది.

ప్రియాంక చోప్రా ముద్దు పేరు

ప్రియాంక చోప్రా ముద్దు పేరు


మీడియాలో ప్రియాంక చోప్రాను....పీసీ, పిగ్గీ చాప్స్ అని పిలవడం మనం వింటూనే ఉన్నాం. కానీ ఆమె అసలు ముద్దు పేరు మిమి.

ప్రపంచ సుందరి

ప్రపంచ సుందరి


ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకున్న ఐదవ భారతీయ మహిళగా మరియు ఏడు సంవత్సరాల కాలంలో కిరీటం దక్కించుకున్న నాల్గవ మహిళగా చోప్రా ప్రసిద్ధి గాంచింది.

మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్

మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్


డాన్, ద్రోణా, మేకీ కోమ్ లాంటి యాక్షన్ చిత్రాల్లో నటించిన ప్రియాంక చోప్రా మార్షల్ ఆర్ట్స్‌లో కూడా శిక్షణ పొందింది.

ఫ్యామిలీ రిలేషన్స్

ఫ్యామిలీ రిలేషన్స్


ప్రియాంక చోప్రా కజిన్ పరిణీతి చోప్రా కూడా సినిమా రంగంలో హీరోయిన్‌గా రాణిస్తోంది. మరో కజిన్ మీరా చోప్రా తెలుగులో బంగారం చిత్రంలో పవన్ కళ్యాణ్‌కు జోడీగా నటించింది.

లక్షలాది మంది పాలోవర్స్

లక్షలాది మంది పాలోవర్స్


ప్రియాంక చోప్రాకు ట్విట్టర్లో ఏకంగా కోటి మంది పైగా ఫాలోవర్స్ ఉన్నారు. హీరోయిన్లలో ఇప్పటి వరకు ప్రియాంక చోప్రానే టాప్.

ఇన్‌స్టాగ్రామ్‌లోనూ...

ఇన్‌స్టాగ్రామ్‌లోనూ...


సెలబ్రిటీలు ఎక్కువగా ఉపయోగించే ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ప్రియాంకకు భారీగా ఫాలోవర్స్ ఉన్నారు.

ఫేవరెట్ ఫెర్ఫ్యూమ్

ఫేవరెట్ ఫెర్ఫ్యూమ్


ప్రియాంక చోప్రా ఫేవరెట్ పెర్ఫ్యూమ్ రాఫ్ లారెన్స్ రొమాన్స్.

తండ్రి మరణం

తండ్రి మరణం


గతేడాది ప్రియాంక చోప్రా తండ్రి అశోక్ చోప్రా మరణించారు. అయితే తండ్రి మరణం తర్వాత వెంటనే కోలుకుని నాలుగు రోజుల్లోనే తన పనిలో నిమగ్నమయింది.

కార్ కలెక్షన్

కార్ కలెక్షన్


ప్రియాంక చోప్రా వద్ద పోర్షే కారుతో పాటు, బిఎండబ్ల్యు 7 సిరీస్, మెర్సిడెస్ ఎస్ క్లాస్ కార్లు ఉన్నాయి.

ఉమ్రా జాన్

ఉమ్రా జాన్


బాలీవుడ్ మూవీ ‘ఉమ్రా జాన్'లో తొలుత ప్రియాంక చోప్రానే తీసుకోవాలనుకున్నారు. కానీ ఆమె డేట్స్ అడ్జెస్ట్ కాక పోవడంతో ఆ స్థానంలో ఐశ్వర్యరాయ్‌ని తీసుకున్నారు.

నేషనల్ అవార్డ్ విన్నర్

నేషనల్ అవార్డ్ విన్నర్


ఫ్యాషన్ సినిమాలో పోషించిన పాత్రకు గాను ప్రియాంక చోప్రా జాతీయ ఉత్తమ నటి అవార్డు గెలుచుకుంది.

జంక్ ఫుడ్ బాగా...

జంక్ ఫుడ్ బాగా...


ప్రియాంక చోప్రాకు జంక్ ఫుడ్ బాగా తినే అలవాటు ఉందట. అయినా ఆమె బాడీ అంత అందంగా ఉండటం ఆమె స్నేహితులను ఆశ్చర్య పరుస్తుంది.

వర్కౌట్స్ కూడా చేయదు...

వర్కౌట్స్ కూడా చేయదు...


ప్రియాంక చోప్రా ఇంత సన్నగా ఉంది కదా...రోజూ వ్యాయామం చేస్తూ తెగ కష్టపడుతుందనుకుంటే పొరపాటే. అసలు అలాంటి అలవాటే ఆమెకు లేదట.

కుక్కలంటే ఇష్టం

కుక్కలంటే ఇష్టం


ప్రియాంక చోప్రాకు కుక్కలంటే ఎంతో ఇష్టం. ఆమె వద్ద ఓ కుక్క కూడా ఉంది.

బ్రాండ్ ఎండార్స్ మెంట్స్

బ్రాండ్ ఎండార్స్ మెంట్స్


గార్నీర్, నికాన్ లాంటి అంతర్జాతీయ బ్రాండ్లకు ప్రియాంక చోప్రా ప్రచారం చేస్తోంది.

చాక్లెట్లు అంటే ఇష్టం

చాక్లెట్లు అంటే ఇష్టం


ప్రియాంక చోప్రాకు చాక్లెట్లు అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ ఆమె బ్యాగులో అవి తప్పనిసరిగా ఉంటాయట.

అకాడమిక్ ఇంట్రెస్ట్స్

అకాడమిక్ ఇంట్రెస్ట్స్


మోడలింగ్, సినిమాల్లోకి రాక ముందు ప్రియాంక చోప్రా ఇంజనీర్ అవ్వాలనుకుంది.

టీవీ స్టార్

టీవీ స్టార్


ప్రియాంక చోప్రా టీవీ షోలు కూడా చేసింది. కత్రోంకి ఖిలాడీ షోను హ్యాండిల్ చేసింది.

బాలీవుడ్లో సెటిలైంది

బాలీవుడ్లో సెటిలైంది


బాలీవుడ్లో వెల్ సెటిల్డ్ యాక్టర్లలో ప్రియాంక చోప్రా ఒకరు. బర్ఫీ, మేరీ కోమ్ లాంటి నటనకు ప్రాధాన్యమున్న చిత్రాల్లో ఆమె నటించింది.

ఐటం నెంబర్స్ కూడా...

ఐటం నెంబర్స్ కూడా...


ప్రియాంక చోప్రా పలు చిత్రాల్లో ఐటం సాంగులు కూడా చేసింది. ‘రామ్ లీలా' చిత్రంలో ప్రియాం చోప్రా చేసిన ఐటం సాంగ్ అదుర్స్.

ఫేవరెట్ చిత్రం

ఫేవరెట్ చిత్రం


ప్రియాంక చోప్రాకు బాగా నచ్చిన చిత్రం ‘దిల్ వాలె దుల్హనియా లే జాయేంగే'.

తమ్ముడున్నాడు...

తమ్ముడున్నాడు...


ప్రియాంక చోప్రాకు సిద్ధార్త్ చోప్రా అనే తమ్ముడు ఉన్నాడు. ప్రియాంక కంటే 7 ఏళ్లు చిన్నవాడు.

ప్రియాంక అఫైర్స్

ప్రియాంక అఫైర్స్


బాలీవుడ్లో అఫైర్స్ అనేవి సాధారణమే. షాహిద్ కపూర్, అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్ లాంటి వారితో ప్రియాంక అఫైర్స్ నడిపినట్లు వార్తలు వినిపించాయి.

హాలీవుడ్ ఫ్రెండ్స్

హాలీవుడ్ ఫ్రెండ్స్


ప్రియాంక చోప్రాకు హాలీవుడ్లో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు.

బర్త్ డే గర్ల్...

బర్త్ డే గర్ల్...


ఈ రోజు ప్రియాంక చోప్రా బర్త్ డే. ఇదే రోజు నెల్సన్ మండేలా బర్త్ డే కావడం విశేషం.

రాబోయే చిత్రాలు

రాబోయే చిత్రాలు


ప్రియాంక చోప్రా నటిస్తున్న బాజిరావు మస్తానీ, గంగాజల్ 2 చిత్రాలు త్వరలో విడుదల కానున్నాయి.

English summary
Priyanka Chopra has been in the industry for a really long time, she started her career with Akshay Kumar and is today romancing younger actors like Ranveer Singh and Arjun Kapoor. The actress is celebrating her birthday today and will be turning 33 years old.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu