ప్రభాస్ రివేంజ్ భారీగా.. సాహో గురించి ఆసక్తికర విషయం!
ప్రభాస్ నటిస్తున్న సాహో చిత్రం ప్రస్తుతం దుబాయ్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. 150 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్నాడు. బాహుబలి తరువాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
కాగా సాహో చిత్రం గురించి ఎటువంటి విషయాలు చిత్ర యూనిట్ బయట పెట్టడం లేదు. సాహో చిత్ర కథ గురించి చిన్న క్లూ కూడా లేదు. తాజగా సాహో కథ గురించి ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. సాహో చిత్రం రివేంజ్ డ్రామాగా తెరకెక్కుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు కళ్లుచెదిరేలా ఉండబోతున్నాయని సమాచారం. ఈ చిత్రంలో మంచి సందేశం కూడా ఉంటుందని వినికిడి. యువి క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.
saaho movie news prabhas movie news shraddha kapoor movie news evelyn sharma movie news సాహో మూవీ న్యూస్ ప్రభాస్ మూవీ న్యూస్ శ్రద్దా కపూర్ మూవీ న్యూస్ ఎలివిన్ శర్మ మూవీ న్యూస్


Click it and Unblock the Notifications