twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ బాబు అడ్డాలో వరుణ్ తేజ్ సినిమా.. క్రేజీ డెసిషన్!

    |

    మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. సంకల్ప్ రెడ్డి దర్శత్వంలో తెరకెక్కుతున్న అంతరిక్షం చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఇక అనిల్ రావిపూడి దర్శత్వంలో తెరకెక్కుతున్న ఎఫ్2 చిత్రం సంక్రాంతికి సందడి చేయబోతోంది. అంతరిక్షం త్వరలో విడుదల కానుండడంతో చిత్ర యూనిట్ భారీ ప్రచార కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. ఈ చిత్ర ట్రైలర్ డిసెంబర్ 9న విడుదల కాబోతున్నట్లు చిత్ర యూనిట్ నిన్ననే ప్రకటించింది. ట్రైలర్ లాంచ్ గురించి ఆకస్తికర వార్తలు ప్రచారం జరుగుతున్నాయి.

    ప్రయోగాత్మక చిత్రం

    ప్రయోగాత్మక చిత్రం

    ఘాజి చిత్రంతో దర్శకుడు సంకల్ప్ రెడ్డి తన సత్తా నిరూపించుకున్నాడు. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకు దూరంగా ప్రయోగాత్మక కథలు ఎంచుకుంటున్నాడు. ఘాజి చిత్రం అందరిని ఆకట్టుకుంది. ఈ సారి అంతరిక్ష పరిశోధన అంశాలతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే అంతరిక్షం చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుకుంది.

    డిసెంబర్ 9న

    డిసెంబర్ 9న


    స్పేస్ లో వరుణ్ తేజ్ చేసే విన్యాసాలని చూడడానికి అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. టీజర్ ఆ ఉత్కంఠని మరింతగా పెంచింది. డిసెంబర్ 9న థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని విభిన్నంగా నిర్వహించబోతున్నలు వార్తలు వస్తున్నాయి.

     ఏఎంబి సినిమాస్

    ఏఎంబి సినిమాస్

    సూపర్ స్టార్ మహేష్ బాబు భాగస్వామిగా ఉన్న ఏఎంబి సినిమాస్ మల్టిప్లెక్స్ ఇటీవలే ఘనంగా ప్రారంభమైంది. అద్భుతమైన విజువల్స్ తో అంతరిక్షం చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దీనితో ఈ చిత్ర ట్రైలర్ ని అత్యాధునిక హంగులు, ఎఫెక్ట్స్ బావుండే థియేటర్ లో ట్రైలర్ లాంచ్ చేస్తే బావుంటుంది అనే ఉద్దేశంతో చిత్ర యూనిట్ ఉంది. దీనితో అంతరిక్షం ట్రైలర్ ని ఏఎంబి సినిమాస్ లో లాంచ్ చేయడానికి నిర్ణయించుకున్నారట.

    ప్రధాన పాత్రల్లో

    ప్రధాన పాత్రల్లో

    ఈ స్పేస్ థ్రిల్లర్ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన అదితి రావు హైదరి, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటిస్తున్నారు. వరుణ్ తేజ్, అదితిరావు హైదరి వ్యోమగాములుగా కనిపిస్తారు. డిసెంబర్ 21 న చిత్రం విడుదల కానుంది. వరుణ్ తేజ్ ఫిదా, తొలిప్రేమ చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి. అంతరిక్షం చిత్రంతో ఈ మెగా హీరో హ్యాట్రిక్ పై కన్నేశాడు.

    English summary
    Interesting news about Varun Tej Antariksham trailer. Here is the details
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X