500 మందితో రాంచరణ్ పోరాటం.. ఉత్కంఠ పెంచేస్తున్న బోయపాటి!

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న తాజా చిత్రం వినయ విధేయ రామ. మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రాంచరణ్, బోయపాటి శ్రీను తొలి కలయికలో వస్తున్న చిత్రం ఇది. బోయపాటి శ్రీను గతః చిత్రాలన్నీ పరిశీలిస్తే.. ఆయన చిత్రాలు మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేసే విధంగా ఉంటాయి. ఇటీవల విడుదలైన వినయ విధేయ రామ టీజర్ కూడా అదే స్పష్టం చేసింది. రాంచరణ్ పవర్ ఫుల్ లుక్ లో కనిపించాడు. అలా అని బోయపాటి పూర్తిగా ఫ్యామిలీ ఆడియన్స్ ని విస్మరించడు. ఇటీవల విడుదలైన తొలి పాట ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకర్షించే విధంగా ఉంది. తాజాగా ఈ చిత్ర షూటింగ్ గురించి ఆసక్తికరమైన అప్డేట్ వచ్చింది.

500 మందితో పోరాటం

500 మందితో పోరాటం

ఇటీవల దర్శకుడు బోయపాటి శ్రీను భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించినట్లు తెలుస్తోంది. రాంచరణ్, 500 మంది జూనియర్ ఆర్టిస్టులపై బోయపాటి ఈ యాక్షన్ సన్నివేసాన్ని రూపొందించారట. రోమాలు నిక్కబొడుకునేలా ఈ ఫైట్ సీన్ అనబోతోందని సమాచారం. ఈ ఫైట్ సన్నివేశంతో షూటింగ్ దాదాపుగా పూర్తయినట్లు తెలుస్తోంది. ఎమోషన్ ని తారాస్థాయికి చేర్చి హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో బోయపాటి దిట్ట.

ఇంటర్వెల్ బ్యాంగ్

ఇంటర్వెల్ బ్యాంగ్

ఈ భారీ పోరాట సన్నివేశం ఇంటర్వెల్ కు ముందు వస్తుందని వార్తలు వస్తున్నాయి. సినిమాలో ఈ సన్నివేశం ప్రధాన ఆకర్షణగా నిలవనునట్లు తెలుస్తోంది. రాంచరణ్ ఈ చిత్రంలో ఐదుగురు సోదరులకు తమ్ముడిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. కథలో కొత్తదనం లేకున్నా స్క్రీన్ ప్లే, యాక్షన్ సన్నివేశాలతో బోయపాటి మ్యాజిక్ చేస్తారు. వినయ విధేయ రామ చిత్రం విషయంలో కూడా అదే జరగబోతున్నట్లు తెలుస్తోంది.

 కైరా అద్వానీ

కైరా అద్వానీ

ఈ చిత్రంలో రాంచరణ్ కు జోడిగా భరత్ అనే నేను హీరోయిన్ కైరా అద్వానీ నటిస్తోంది. బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. స్నేహ, ఆర్యన్ రాజేష్, ప్రశాంత్ లాంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తుండడం విశేషం. వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్రని దర్శకుడు చాలా అద్భుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

 రెండు చిత్రాలతో బిజీ

రెండు చిత్రాలతో బిజీ

రాంచరణ్ ప్రస్తుతం చాలా బిజీగా గడుపుతున్నాడు. ఓ వైపు వినయ విధేయ రామ, ఆర్ఆర్ఆర్ చిత్రాల్లో నటిస్తూనే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహా రెడ్డి చిత్ర నిర్మాణ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నాడు. వినయ విధేయ రామ చిత్రం జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. రంగస్థలం చిత్రం తరువాత రాంచరణ్ నటిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X