అనుష్క బర్త్ డే.. వైరల్ అవుతున్న క్రేజీ న్యూస్!

Recommended Video

#HBDAnushkaShetty : Anushka Shetty Plays A Role In Ntr Bio Pic

అందం, అభినయం అన్నీ కలబోసిన నటి అనుష్క. తనకు మాత్రమే సాధ్యం అన్నట్లుగా అనుష్క బాహుబలిలో దేవసేన, అరుంధతి, భాగమతి వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. గ్లామర్ పాత్రలు అయినా, లేడి ఓరియెంటెడ్ చిత్రాలు అయినా అనుష్క నటిస్తే ప్రేక్షకులు మైమరచిపోవాల్సిందే. అనుష్క చివరగా నటించిన చిత్రం భాగమతి. భాగమతి తరువాత అనుష్క మరో చిత్రంలో నటించలేదు. నేడు అనుష్క 37వ పుట్టినరోజు. ఈ సందర్భంగా అనుష్క గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.

బరువు తగ్గడం కోసం

బరువు తగ్గడం కోసం

ప్రస్తుతం అనుష్క విదేశాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. బరువు తగ్గడం కోసం అనుష్క సహజసిద్ధమైన వైద్యం కోసం విదేశాలు వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. తిరిగి వచ్చాక సరికొత్త అనుష్కని చూడవచ్చు. ఇదిలా ఉండగా అనుష్క్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులంతా శుభాకాంక్షలతో సోషల్ మీడియాని మోతెక్కిస్తున్నారు.

క్రేజీ న్యూస్ వైరల్

క్రేజీ న్యూస్ వైరల్

అనుష్క గురించి ఆసక్తికర ప్రచారం మొదలయింది. నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అనుష్క కీలక పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది స్టార్స్ ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో భాగం అవుతున్న సంగతి తెలిసిందే.

అలనాటి హీరోయిన్

అలనాటి హీరోయిన్

అలనాటి హీరోయిన్ బి సరోజ దేవి, ఎన్టీఆర్ కలసి అనేక చిత్రాల్లో నటించారు. వీరి కాంబినేషన్ లో శ్రీ రామాంజనేయ యుద్ధం, జగదేక వీరుని కథ, దానవీర శూర కర్ణ వంటి అద్భుత చిత్రాలు వచ్చాయి. సరోజ దేవి పాత్ర కోసం ఎన్టీఆర్ బయోపిక్ చిత్ర యూనిట్ అనుష్కని సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది.

 తిరిగి వచ్చాక

తిరిగి వచ్చాక

అనుష్క విదేశాల నుంచి తిరిగి వచ్చాక ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో నటించే విషయమై ఓ క్లారిటీ వస్తుంది. అనుష్క తన తదుపరి చిత్రాలకు కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఓవైపు అనుష్క పెళ్ళికి సిద్ధం అవుతోంది అంటూ కూడా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X