ఎంబీఏ విద్యార్థి రైతుల గురించి ఎలా.. మహేష్ సినిమా కథ ఇదే.. గడ్డం స్టైల్ అదుర్స్!
Recommended Video

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం వంశీ పైడి పల్లి దర్శకత్వంలో రూపొందుతోంది. మహేష్, పూజా హెగ్డే ఈ చిత్రంలో జంటగా నటిస్తున్నారు. ఇది మహేష్ కు 25 వ చిత్రం. దిల్ రాజు, అశ్విని దత్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సరికొత్త లుక్ లో మహెష్ బాబు ఈ చిత్రంలో కనిపిస్తాడు. ఆరంభం నుంచి భారీ అంచనాలు మొదలైన ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం డెహ్రాడూన్ లో జరుగుతోంది. కాలేజీ నేపథ్యంలో సన్నివేశాలని దర్శకుడు వంశీ చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్ర కథ తాజగా మొదలైన ప్రచారం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇదొక సందేశాత్మక చిత్రం అని అంటున్నారు.

ఎంబీఏ విద్యార్థిగా
మహేష్ బాబు ఈ చిత్రంలో ఎంబీఏ విద్యార్థిగా కనిపించబోతున్నాడు. ఎక్కువభాగం ఈ చిత్ర షూటింగ్ అమెరికాలో జరుగుతుందని సమాచారం. మహేష్ గడ్డం లుక్ కి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

రైతు సమస్యల గురించి
ఈ చిత్ర కథ ప్రధానంగా రైతు సమస్యలపై సాగుతుందని అంటున్నారు. ఎంబీఏ విద్యార్థిగా ఉన్న మహేష్ కు రైతు సమస్యలకు ఉన్న సంబంధం ఏమిటి.. దర్శకుడు ఎలా లింక్ చేశాడు అనే అంశాల గురించి అభిమానుల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

సందేశాత్మక చిత్రాలు
ఇటీవల కాలంలో మహేష్ నుంచి సందేశాత్మక చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయి. శ్రీమంతుడు, భరత్ అనే నేను ఆ కోవకు చెందినవే. కానీ మహేష్ 25 వ చిత్రంలో ఇటివంటి సెటైరికల్ అంశాలు ఉండవని నేరుగా దర్శకుడు సమస్య గురించే చెప్పబోతున్నట్లు తెలుస్తోంది.

గడ్డం లుక్ అదుర్స్
మహేష్ తన ఫిజికల్ ట్రైనర్ తో ఉన్న పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహేష్ కొత్త గడ్డం లుక్ లో మహేష్ స్టైల్ అదిరిపోయింది.


Click it and Unblock the Notifications











