twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ 25వ సినిమా టైటిల్, ఫ్యాన్స్ హంగామా.. రోమాలు నిక్కబొడుచుకునేలా మహేష్ లుక్!

    |

    Recommended Video

    Mahesh Babu 25 Movie Title Declared

    సూపర్ స్టార్ మహేష్ బాబు 25 వ చిత్రానికి రెడీ అవుతున్నాడు. ప్రతిభగల దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ చిత్రాన్ని తెరెకెక్కిస్తున్నారు. జూన్ నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. భరత్ అనే నేను చిత్రం తరువాత మహేష్ తదుపరి చిత్రంపై భారీ స్థాయిలో అంచనాలు పెరిగాయి. అందుకు తగ్గట్లుగానే మహేష్ తన దర్శకులని ఎంపిక చేసుకుంటున్నారు. వంశీ పైడిపల్లి చిత్రం తరువాత మహేష్ సుకుమార్ దర్శకత్వంలో నటించబోతున్నాడు. కాగా మహేష్ 25 వ చిత్రం గురించి సోషల్ మీడియాలో అప్పుడే హంగామా మొదలైంది.

    భారీగా పెరిగిన అంచనాలు

    భారీగా పెరిగిన అంచనాలు

    భరత్ అనే నేను చిత్రం ఘనవిజయం సాధించింది. తన తదుపరి చిత్రాలు అభిమానులకు మరింత వినోదాన్ని పంచేలా మహేష్ ప్లాన్ చేసుకుంటున్నాడు. భరత్ అనే నేను ముఖ్యమంత్రిగా కనిపించిన మహేష్ నెక్స్ట్ మూవీలో ఎలాంటి రోల్ లో కనిపించబోతున్నాడనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది.

    జూన్ నుంచి ప్రారంభం

    జూన్ నుంచి ప్రారంభం

    వంశీ పైడిపల్లి దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాతలు అశ్వినీదత్, దిల్ రాజు సంయుక్త నిర్మాణంలో మహేష్ 25 వ చిత్రం రూపుదిద్దుకోబోతోంది. ఈ చిత్ర షూటింగ్ ని జూన్ నుంచి ప్రారంభించబోతున్నారు. భరత్ అనే నేను చిత్రం తరువాత మహేష్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు.

    ఫాన్స్ హంగామా

    ఫాన్స్ హంగామా

    ఈ చిత్ర టైటిల్ పై అప్పుడే ఫాన్స్ లో ఊహాగానాలు మొదలైపోయాయి. ఊహాగానాలు మాత్రమే కాదు ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ తో రచ్చ మొదలుపెట్టారు. మహేష్ 25 వ చిత్ర టైటిల్ 'రాజసం' అంటూ ప్రచారం చేస్తున్నారు.

    కోరమీసం లుక్ అదుర్స్

    కోరమీసం లుక్ అదుర్స్

    మహేష్ 25 చిత్ర టైటిల్ విషయంలో జరుగుతున్న ప్రచారం నిజామా కాదా అని చిత్ర యూనిట్ స్పందించాల్సి ఉంది. కానీ ఫాన్స్ ట్రెండ్ చేస్తున్న మహేష్ కోరమీసం లుక్ మాత్రం అదిరిపోయింది. మహేష్ ఈ చిత్రంలో మీసాలతో కనిపిస్తాడనే ప్రచారం కూడా ఉంది.

    English summary
    Interesting news on Mahesh Babu 25th movie title. Fans hungama in social media
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X