బ్రిటిష్ సైనికులపై నైట్ టైమ్ అటాక్, మారణాయుధాలతో సైరా .. అదిరిపోయే యాక్షన్ సీన్ విశేషాలు!

Recommended Video

Chiranjeevi Sye Raa Movie Action Scenes Started Shooting

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సైరా చిత్రం దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ లో రూపొందుతున్న సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడెక్షన్స్ బ్యానర్ పై స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అతిరధ మహారథులుగా చెప్పబడే నటులంతా ఈ చిత్రంలో నటిస్తున్నారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ ఈ చిత్రంలో కామియో రోల్ పోషిస్తుండగా, నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంబందించి యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ ప్రారంభమైంది.

యుద్ధం మొదలు పెట్టిన సైరా

యుద్ధం మొదలు పెట్టిన సైరా

సైరా చిత్రం ఇప్పటికే కీలకమైన షెడ్యూల్ పూర్తి చేసుకుంది. త్వరలో ప్రారంభించబోయే షెడ్యూల్ లో సినిమాకే హైలైట్ గా నిలిచే యాక్షన్ ఎపిసోడ్ ని చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది.

బ్రిటీష్ సైనికులపై అటాక్

బ్రిటీష్ సైనికులపై అటాక్

ఈ యాక్షన్ సన్నివేశాల్ని నైట్ ఎఫెక్ట్ తో చిత్రీకరిస్తారట. సైరా నరసింహా రెడ్డి బ్రిటిష్ సైనికులపై అటాక్ చేసే సన్నివేశం ఇది. ఈ పోరాటంలో గుర్రాలు గట్రా ఏమి ఉండవు. తుపాకులు, ఇతర మారణాయుధాలు ఉపయోగించి సైరా నరసింహారెడ్డి బ్రిటిష్ సైనికులతో తలపడబోతున్నాడు.

హైదరాబాద్ లోనే

హైదరాబాద్ లోనే

మొదట ఈ యాక్షన్ ఎపిసోడ్ ని విదేశాల్లో చిత్రీకరించాలని భావించినా ఆ తరువాత హైదరాబాద్ లోని షూట్ చేయడానికి నిర్ణయించుకున్నారు.

2019 వేసవిలో

2019 వేసవిలో

సైరా చిత్రం గత ఏడాది ప్రారంభం అయింది. చిత్రానికి సంబందించిన కాస్టింగ్ విషయంలో ఎక్కువగా జాప్యం జరిగింది. ఇక ఆలస్యం చేయకూడదని భావిస్తున్న చిరు వేగంగా షూటింగ్ ఫినిష్ చేసి 2019 వేసవిలో సైరా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X