అజ్ఞాతవాసి తరువాత మళ్ళీ.. బాగా గ్యాప్ తీసుకుని!
ఈ ఏడాది ఆరంభంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి విడుదలైంది. ఈ చిత్రంతో సంచలన తమిళ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. అజ్ఞాతవాసి చిత్రం విజయం సాధించకపోవడంతో అనిరుధ్ తెలుగులో మరో చిత్రం చేయలేదు.
అనిరుద్ తక్కువ సమయంలోనే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాడు. తనదైన విభిన్నమైన శైలిలో ఆకట్టుకునే విధంగా సంగీతం అందించడంతో అందరి దృష్టి ఈ దర్శకుడిపై పడింది. అనిరుద్ మళ్ళీ తెలుగులో ఎప్పుడు చేస్తాడు అనే ప్రశ్న మొదలవుతుంది తరుణంలో ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది.

క్రికెట్ కథాంశంతో తెరకెక్కుతున్న నాని చిత్రం జెర్సీకి అనిరుద్ సంగీతం అందించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావలసి ఉంది. క్రికెట్ నేపథ్యంలో విభిన్న కథతో తెరకెక్కబోయే చిత్రం కావడంతో అనిరుద్ అయితే బావుంటుందని దర్శకుడు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మళ్ళీ రావా ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి దర్శకుడు.


Click it and Unblock the Notifications