రాంచరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్.. దొంగ, పోలీస్ ఆటా..!
మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో దర్శకధీరుడు రాజమౌళి భారీ మల్టీస్టారర్ స్టారర్ చిత్రానికి ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. రాజమౌళి ఈ చిత్ర కథని ఇద్దరు హీరోలకు ఇంకా వివరించాల్సి ఉంది. తాజాగా వస్తున్న ఈ వార్తలు ఈ చిత్రంపై ఆసక్తిని పెంచే విధంగా ఉన్నాయి.
తాజగా జరుగుతున్న ప్రచారం ప్రకారం ఈ చిత్రంలో రాంచరణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో, ఎన్టీఆర్ గ్యాంగ్ స్టర్ పాత్రలో నటిస్తారట. యాక్షన్ సన్నివేశాలు భారీ స్థాయిలో ఉంటాయి. నిర్మాత డివివి దానయ్య ఈ చిత్రం కోసం 300 కోట్ల భారీ బడ్జెట్ పెట్టేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది.

రాంచరణ్ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఎన్టీఆర్ అరవింద సమేత చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ రెండు చిత్రాలు పూర్తయ్యాక రాజమౌళి చిత్రం ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











