త్రివిక్రమ్ సత్తాకు అజ్ఞాతవాసి అడ్డు కాదు.. ఎన్టీఆర్ సినిమా హవా మొదలైంది!
పవన్ కళ్యాణ్ అభిమానుల భారీగా ఆశలు పెట్టుకున్న అజ్ఞాతవాసి చిత్రం నిరాశపరిచిన సంగతి తెలిసిందే. అజ్ఞాతవాసి చిత్రం విడుదల కాకముందే త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమాని ప్రారంభించాడు. అజ్ఞాతవాసి చిత్రం విడుదలయ్యాక ఎన్టీఆర్ చిత్ర కూర్పులో త్రివిక్రమ్ కొన్ని మార్పులు చేయక తప్పలేదు. సంగీత దర్శకుడు అనిరుధ్ స్థానంలో తమన్ ని తీసుకున్న తీసుకున్న సంగతి తెలిసిందే.
దీనితో ఎన్టీఆర్ అభిమానుల్లో ఈ చిత్రంఫై గందరగోళం నెలకొంది. ఆ గందరగోళానికి చెక్ పెడుతూ ఇటీవల ఈ చిత్ర షూటింగ్ మొదలైన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ సలహామేరకు ఎన్టీఆర్ తన లుక్ ని మార్చుకుని మరీ రంగంలోకి దిగాడు. వస్తున్న వార్తల ప్రకారం ఈ చిత్రంలో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం అలా మొదలైందో లేదో అప్పుడే ఈ చిత్ర హక్కులని సొంతం చేసుకునేందుకు డిస్ట్రిబ్యూటర్స్ ఎగబడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఓవర్సీస్ హక్కుల ఎల్ఏ తెలుగు అనే సంస్థ భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. సాధారణంగానే ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాలకు ఓవర్శిస్ లో మంచి మార్కెట్ ఉంటుంది. ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా విషయంలో అన్ని అనుకూలంగా జరుగుతుండడంతో అజ్ఞాతవాసి పరాజయం ప్రభావం ఈ చిత్రంపై పడలేదని స్పంష్టంగా అర్థం అవుతోంది.


Click it and Unblock the Notifications











