RC15: రామ్ చరణ్ - శంకర్ సక్సెస్ ఫార్ములా.. రంగస్థలం కంటే హై రేంజ్ యాక్టింగ్.. రాజమౌళితో స్టార్ట్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ RRR సినిమా అనంతరం శంకర్ దర్శకత్వంలో ఒక సినిమాను మొదలు పెట్టబోతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ ప్రాజెక్టుపై అన్ని వర్గాల ప్రేక్షకుల అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి. ఎందుకంటే దర్శకుడు శంకర్ గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక టాలీవుడ్ హీరోతో సినిమా చేస్తున్నాడు అనగానే ఒక్కసారిగా అంచనాలు అకాశాన్ని దాటేశాయి. RRR సినిమా అనంతరం రామ్ చరణ్ మార్కెట్ వాల్యూ మరో స్థాయికి వెళుతుందని చెప్పవచ్చు. కాబట్టి శంకర్ సినిమాకు కూడా అది చాలా హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక రామ్ చరణ్ సినిమాపై శంకర్ తన ఫార్ములాను ఉపయోగించి బోతున్నాడు. రంగస్థలం కంటే హై లెవెల్లో యాక్టింగ్ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాడట. ఇక ఈ సినిమాకు మొదట రాజమౌళితోనే మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

మంచి విజయాన్ని అందుకోవాలని

మంచి విజయాన్ని అందుకోవాలని

దర్శకుడు శంకర్ ఎలాంటి సినిమా చేసినా కూడా దాదాపు అన్ని భాషల్లో రిలీజ్ అవుతూ ఉంటాయి. భాషతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపిస్తారు. అయితే గత కొంత కాలంగా శంకర్ బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో అయితే సక్సెస్ కాలేకపోతున్నారు. చివరగా వచ్చిన 2.0 సినిమా తీవ్రస్థాయిలో నిరాశపరిచిన విషయం తెలిసిందే. ఇక మరోవైపు ఇండియన్ 2 సినిమా కూడా ఆగిపోవడంతో శంకర్ తన తదుపరి సినిమాతో ఎలాగైనా మంచి విజయాన్ని అందుకోవాలని అనుకుంటున్నాడు.

రంగస్థలం సినిమా తరువాత

రంగస్థలం సినిమా తరువాత

రామ్ చరణ్ తో సినిమా చేయాలని శంకర్ గత ఏడాది నుంచే ప్రణాళికలు రచిస్తున్నారు. అసలైతే శంకర్ గతంలో ఒకసారి మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ ఎందుకో వర్కవుట్ కాలేదు. ఇక ఎప్పుడైతే రంగస్థలం సినిమా చూశారో శంకర్ అప్పటి నుంచి రామ్ చరణ్ తో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇక ముందుగా అనుకున్న ఒక స్టోరీ లైన్ ను పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో డెవలప్ చేసి రామ్ చరణ్ కు వినిపించాడు. ఇక రామ్ చరణ్ కూడా ఆ కథను వినగానే ఒప్పుకున్నాడు. దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

సక్సెస్ ఫార్ములా

సక్సెస్ ఫార్ములా

రామ్ చరణ్ ఈ సినిమాలో రెండు భిన్నమైన పాత్రల్లో కనిపిస్తాడని తెలుస్తోంది. చివరగా నాయక్ సినిమాలో ద్విపాత్రాభినయం చేసిన రామ్ చరణ్ మళ్ళీ ఇప్పుడు శంకర్ సినిమా కోసం అదే ఫార్మాట్ లో కనిపించబోతున్నాడు. ఇక శంకర్ పొలిటికల్ సినిమాలను టచ్ చేసిన ప్రతిసారి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఒకే ఒక్కడు శివాజీ సినిమాల తర్వాత పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో మరొక సినిమాలు చేయలేదు. ఇక ఈ సారి పూర్తి స్థాయిలో రాజకీయ అంశాలతోనే రామ్ చరణ్ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నట్లు సమాచారం.

Recommended Video

Shakalaka Shankar Corporator Movie Official Trailer Released | Filmibeat Telugu
 రాజమౌళితో స్టార్ట్.. విడుదల ఎప్పుడంటే?

రాజమౌళితో స్టార్ట్.. విడుదల ఎప్పుడంటే?

ఇక రామ్ చరణ్ 15వ సినిమాను రేపు ఉదయం గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్నారు. ఇక ఈ వేడుకకు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రత్యేక అతిథిగా పాల్గొన్న పోతున్నాడు. ఆయానతోనే మొదటి షాట్ కు క్లాప్ కొట్టించబోతున్నారు. అందుకు సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే గట్టిగానే వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమాను నిర్మాత దిల్ రాజు దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శంకర్ కూడా సినిమా ప్రొడక్షన్ లో.కొంత పెట్టుబడి పెడుతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాను 2023 జనవరి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X