సైరాలో ఆ నాలుగు.. రోమాలు నిక్కబొడుచుకునేలా!
Recommended Video
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి. తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మెగాపవర్ స్టార్ రాంచరణ్ స్వయంగా ఈ చిత్రాన్ని 200 కోట్ల భారీ వ్యయంతో నిర్మిస్తుండడం విశేషం. సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. నరసింహారెడ్డి వీరత్వాన్ని ప్రతిభింబించేలా ఈ చిత్రం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. నయనతార, తమన్నా లాంటి క్రేజీ హీరోయిన్లు ఈ చిత్రంలో నటిస్తున్నారు. సైరా చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి.

ఉయ్యాలవాడ చరిత్ర
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన పోరాటానికి సరైన గుర్తింపు లభించలేదు. చాలా మంది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి విని ఉంటారు కానీ ఆయన చరిత్ర పూర్తిగా తెలియదు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్రంతో ఆ మహావీరుడి చరిత్ర ప్రజల్లోకి వెళ్లే అవకాశం వచ్చింది. సైరా చిత్రంలో నరసింహారెడ్డి పోరాటాలని చూపించబోతున్నారు. హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ల ఆధ్వర్యంలో ఈ చిత్ర యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కుతున్నాయి.

పోరాట సన్నివేశాలు
తాజాగా సైరా చిత్రంలోని పోరాట సన్నివేశాల గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో బ్రిటిష్ వారికి, నరసింహారెడ్డికి మధ్య నాలుగు పోరాట సన్నివేశాలు ఉంటాయట. ఈ నాలుగు యుద్ధం తరహాలో సాగుతాయని అంటున్నారు. చిరంజీవి నటన ఈ యాక్షన్ సీన్స్ లో రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటుందని అంటున్నారు. చిరు ఈ వయసులో కూడా ఆ సన్నివేశాల్లో ఉత్సాహ భరితంగా పెర్ఫామ్ చేశారని టాక్.

రాంచరణ్ నిర్మాణంలో
సైరా చిత్రం మెగా పవర్ స్టార్ రాంచరణ్ నిర్మాణంలో తెరక్కుతోంది. ఇటీవల సైరా సెట్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై రాంచరణ్ స్పందించిన సంగతి తెలిసిందే. ఈ అగ్నిప్రమాదంలో సెట్స్ కాలిపోయాయి కానీ, ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని చరణ్ క్లారిటీ ఇచ్చాడు.

నటీనటులు
సైరా చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. తమన్నా కీలక పాత్రలో నటిస్తోంది. అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకుంది కాబట్టి త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలని ప్రారంభించి విడుదల తేదీని ప్రకటించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.


Click it and Unblock the Notifications











