ఆ విషయంలో టెన్షన్ ఫీలయ్యా... అది స్టుపిడ్ ఆలోచన.. నరకం చూపించారు: మహేష్ బాబు

Recommended Video

Interesting Points From Maharshi Movie Team Interview || Filmibeat Telugu

సూపర్‌స్టార్ మహేష్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్, పి.వి.పి సినిమా పతాకాలపై హై రూపొందుతోన్న భారీ చిత్రం 'మహర్షి'. సూపర్‌స్టార్ మహేష్‌కు ఇది 25వ చిత్రం. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

మే 9న ప్రపంచవ్యాప్తంగా 'మహర్షి' చిత్రం విడుదలువుతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ జోరు పెంచారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఓ ప్రమోషనల్ వీడియోలో మహేష్ బాబు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. తనదైన శైలిలో పంచులు వేస్తూ అందరినీ నవ్వించారు.

ఆయన పేరులోనే అల్లరి... నరేష్ చాలా కామ్

ఆయన పేరులోనే అల్లరి... నరేష్ చాలా కామ్

నరేష్ గారి పేరులోనే అల్లరి ఉంది తప్ప ఆయన అల్లరి చేసే వ్యక్తి కాదని మహేష్ బాబు తెలిపారు. మనం ఏమైనా మాట్లాడితేనే మాట్లాడతారు తప్ప ఆయనగా వచ్చి మాట్లాడరని సూపర్ స్టార్ వ్యాఖ్యానించారు. ఈ చిత్రంలో నరేష్ పోషించిన పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందని తెలిపారు. రేపు సినిమాలో మంచి పేరు వచ్చే పాత్రల్లో ఒకటిగా నిలుస్తుందన్నారు.

పొలంలో నాట్లు వేయడం ఇదే తొలిసారి

పొలంలో నాట్లు వేయడం ఇదే తొలిసారి

పొలంలో నాట్లు వేయడం ఫస్ట్ టైమ్... ఇప్పటి వరకు ఎప్పుడూ ఆ అవకాశం రాలేదు. వంశీ కథ చెప్పగానే తప్పకుండా చేయాలనిపించింది. కానీ నాకు రెండు మూడు కమిట్మెంట్స్ ఉన్నాయి... వెయిట్ చేస్తావా అంటే ఇందులో మీరు తప్ప ఎవరినీ ఊహించుకోలేను సర్ అని చెప్పారు, ఫైనల్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని మహేష్ బాబు తెలిపారు.

అది స్టుపిడ్ థాట్

అది స్టుపిడ్ థాట్

‘మహర్షి' అంటే మహా అనే హీరోయిన్, రిషి అనే హీరో ఉంటారని అనుకున్నాం... అంటూ యాంకర్ సరదాగా వ్యాఖ్యానించగా మహేష్ బాబు వెంటనే రియాక్ట్ అవుతూ ‘ఇది స్టుపిడ్ థాట్. అలాంటి మీనింగుతో పేరు పెడితే చండాలంగా ఉంటుంది.'' అని వ్యాఖ్యానించారు.

కథ విన్నపుడు టెన్షన్ పడ్డాను

కథ విన్నపుడు టెన్షన్ పడ్డాను

కథ విన్నపుడు నాకు ఒకటే టెన్షన్... ఫస్టాఫ్ 45 మినట్స్ కాలేజ్ బ్యాక్ డ్రాప్. ఇది కన్విన్సింగ్‌గా చేస్తే అమేజింగ్. కానీ ఎప్పుడో 20 ఏళ్ల క్రిందట యువరాజులో కాలేజీ స్టూడెంటుగా నటించాను. మళ్లీ 25వ సినిమాకు అలా చేయడం అంటే మామూలు విషయం కాదు. చాలా కన్విక్షన్ కావలి. అది ఆడియన్స్ కు కనెక్ట్ అవ్వడం ఎంతో ముఖ్యమని మహేష్ బాబు చెప్పుకొచ్చారు.

నన్ను పంపించేసి పార్టీ చేసుకున్నారు

నన్ను పంపించేసి పార్టీ చేసుకున్నారు

ఏదో వినోదం కోసం కాలేజీ సీన్ పది నిమిషాలు పెట్టలేదు. మొదటి 45 నిమిషాలు కాలేజీలో జరిగే సినిమాలో చాలా ముఖ్యమైనది. డెహ్రాడూన్ ఫస్ట్ షెడ్యూల్ అవ్వగానే నన్ను పంపించి వీళ్లంతా పార్టీ చేసుకున్నారు. అనుకున్నదానికంటే బాగా రావడమే అందుకు కారణం. ఇన్ని సినిమాల తర్వాత యాక్షన్, ఎమోషన్ చేయడం చాలా ఈజీ. కానీ కాలేజీ స్టూడెంటుగా చేయడం కష్టమని మహేష్ అభిప్రాయ పడ్డారు.

దువ్వి దువ్వి నరకం చూపించారు

దువ్వి దువ్వి నరకం చూపించారు

సినిమాలో మూడు భిన్నమైన క్యారెక్టర్లు చేయడం ఎగ్జైటింగ్ అనిపించింది. అయితే చేసేపుడు నరకం అనిపించింది. కాలేజ్ లుక్ అయిపోయింది వంశీ హ్యాపీ. తర్వాత విలేజ్ లుక్ కూడా నచ్చేసింది. మధ్యలో సీఈఓ లుక్ ఉంటుంది. దాని విషయంలో ఎలా చేద్దామని ఇంట్లో టెస్ట్ చేస్తున్నారు. సూట్లన్నీ వేసుకున్నాను. పది రకాలుగా దువ్వారు. స్టైలిస్ట్, డీఓపీ ఫైనల్ గా ఇది బావుంది అన్నారు. నేను చూసి ఇది బావుంది కదా వంశీ అంటే... నచ్చలేదు సార్ అన్నాడు. సరే మళ్లీ దువ్వండి అన్నాం. ఫైనల్‌గా ఆయనకు ఓ లుక్ నచ్చింది, హమ్మయ్య అనుకున్నాను... అంటూ మహేష్ బాబు చమత్కరించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X