»   » చైతు-సమంత పెళ్లి సంబరాల్లో..... ఆసక్తికర విషయాలు!

చైతు-సమంత పెళ్లి సంబరాల్లో..... ఆసక్తికర విషయాలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

సమంత, నాగ చైతన్య పెళ్లి వేడుకకు అంతా సిద్ధమైంది. పర్యాటకుల స్వర్గధామమైన గోవాలో వీరి వివాహం జరుగబోతోంది. గోవాలోని స్టార్ హోటల్ 'డబ్ల్యు'లో వీరి వివాహ కొద్ది మంది బంధువులు, సన్నిహితులు మధ్య జరుగబోతోంది.

నాగ చైతన్య, సమంత వేర్వేరు మతాలకు చెందిన వారు కావడంతో వివాహ వేడుక హిందూ, క్రైస్తవ సాంప్రదాయాల ప్రకారం రెండు సార్లు జరుపబోతున్నారు. మొదట అక్టోబర్ 6న హిందూ సాంప్రదాయ ప్రకారం వివాహం జరుగబోతోంది.

పెళ్లి ముహూర్తం

పెళ్లి ముహూర్తం

అక్టోబర్ 6వ తేదీ రాత్రి 11.52 గంటలకు పెళ్లి ముహూర్తం నిర్ణయించారు. అంతకుంటే ముందు మధ్యాహ్నం 3 గంటలకు నుండి సాయంత్రం 6 గంటల వరకు మెహందీ వేడుక జరుగనుందని సమాచారం.

క్రిస్టియన్ వెడ్డింగ్ టైమ్

క్రిస్టియన్ వెడ్డింగ్ టైమ్

హిందూ సాంప్రదాయంలో పెళ్లి పూర్తయిన తర్వాత అక్టోబర్ 8వ తేదీన సాయంత్రం 5.30 గంటల నుండి 6.30 గంటల మధ్య క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం వివాహ వేడుక జరుగనుంది.

ప్రతి అంశాన్ని వివరించనున్న పురోహితులు

ప్రతి అంశాన్ని వివరించనున్న పురోహితులు

హిందూ సాంప్రదాయంలో వివాహం జరిగే సమయంలో పురోహితులు పెళ్లి మంత్రాల్లోని అర్ధాన్ని వధూ వరులకు వివరించి చెప్పనున్నారు. వివాహ వేడుకలో సప్తపది, ఏడు అడుగులు, అగ్నిగుండం లాంటివి ఎందుకు నిర్వహిస్తారు అనేది వివరించనున్నారు.

ప్రత్యేక దుస్తులు

ప్రత్యేక దుస్తులు

హిందూ సాంప్రదాయంలో జరిగే వివాహ వేడుకలో నాగ చైతన్య గ్రాండ్ మదర్ డి రాజేశ్వరి చీరను సమంత ధరించనుంది. దీంతో పాటు ఆమెకు సంబంధించిన బంగారు నగలను సమంత ధరించనుంది. నాగ చైతన్య ట్రెడిషనల్ ధోతీ ధరిస్తారు. క్రిస్టియన్ వెడ్డింగులో సమంత క్రేష్నా బజాజ్ డిజైన్ చేసిన దుస్తులు ధరించనుంది. చైతు 3 పీస్ సూట్ ధరిస్తారు.

పరిమిత సంఖ్యలో గెస్టులు

పరిమిత సంఖ్యలో గెస్టులు

ఈ వివాహ వేడుకకు కొద్ది సంఖ్యలో మాత్రమే గెస్టులు హాజరు కాబోతున్నారు. అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు సమంత ఫ్యామిలీ హాజరు కానుంది. చైతూ చిన్ననాటి ఫ్రెండ్స్ రామ్ చరణ్, మరికొందరు ఈ వేడుకకు హాజరవుతారు. పెళ్లి వేడేక తర్వాత హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ జరుగనుంది. త్వరలో డేట్ ప్రకటించనున్నారు.

హనీమూన్

హనీమూన్

పెళ్లి తర్వాత తమ సినిమా షూటింగుల్లో బిజీ కాబోతున్న నాగ చైతన్య, సమంత క్రిస్ మస్ సీజన్లో యూఎస్ఏకు హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు.

English summary
The stage is set for the wedding of leading south actress Samantha with Telugu actor Naga Chaitanya, the son of Tollywood superstar Nagarjuna. They will tie the knot at W Goa hotel in Bardez, Goa.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu