తుగ్లక్ చరిత్రతో నందమూరి హీరో ఫాంటసీ చిత్రం.. క్రేజీగా టైటిల్!
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఇటీవల విడుదలైన 118 చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. కళ్యాణ్ రామ్ కు వరుసగా ప్లాపులు ఎదురవుతున్న కీలక సమయంలో ఈ విజయం లభించింది. దీనితో కళ్యాణ్ రామ్ మరింత ఉత్సాహంగా తదుపరి చిత్రాలని ఎంపిక చేసుకుంటున్నాడు. ఇకపై విభిన్నమైన కథలతో చిత్రాలు చేయాలని కళ్యాణ్ రామ్ భావిస్తున్నాడు. అందుకు తగ్గట్లుగానే కథలు ఎంచుకుంటున్నాడు. కళ్యాణ్ రామ్ తదుపరి చిత్రంపై ఆసక్తికర వార్తలు వస్తున్నాయి.

ఫాంటసీ నేపథ్యంలో
తాజాగా కళ్యాణ్ రామ్ ఓ ఫాంటసీ చిత్రానికి ఓకె చెప్పినట్లు తెలుస్తోంది. డెబ్యూ దర్శకుడు మల్లిడి వశిస్ట్ చెప్పిన కథకు కళ్యాణ్ రామ్ ఇంప్రెస్ అయినట్లు తెలుస్తోంది. వైవిధ్యంతో కూడుకున్న ఈ చిత్రం ఫాంటసీ నేపథ్యంలో సాగుతుందట. కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని తన సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ లో ఈ నిర్మించాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది.

క్రేజీ టైటిల్
ఈ చిత్రానికి 'అశ్వథామ' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అశ్వథామ అనే పేరుని మనం మహాభారతంలో వింటాం. దీనితో ఈ చిత్ర కథ ఎదో బలంగానే ఉండబోతున్నట్లు అంచనా వేస్తున్నారు. 118 చిత్రంతో కల నేపథ్యంలో సాగే కథని కళ్యాణ్ రామ్ ఎంచుకున్నాడు. ఆ ప్రయత్నం విజయవంతం అయింది. ఉత్కంఠ భరితంగా సాగే కథలతో ఆడియన్స్ ని మెప్పించాలని కళ్యాణ్ రామ్ భావిస్తున్నాడు.

వరుస పరాజయాలకు బ్రేక్
పటాస్ చిత్రం తర్వాత కళ్యాణ్ రామ్ నటించిన చిత్రాలు ఏవీ విజయం సాధించలేదు. పటాస్ తర్వాత కళ్యాణ్ రామ్ ఎక్కువగా కమర్షియల్ చిత్రాలే చేశాడు. అవన్నీ నిరాశపరచడంతో విభిన్నమైన జోనర్ లో తెరకెక్కించిన 118 విజయాన్ని అందించింది. 118 చిత్రంతో కళ్యాణ్ రామ్ కెరీర్ కాస్త జోరందుకుంది. ఇక అశ్వథామతో ఎలా మెప్పిస్తాడో చూడాలి.

తుగ్లక్ చరిత్ర
అశ్వథామ చిత్రానికి సంబంధించిన మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. ఈ చిత్రంలో ఢిల్లీ సుల్తాన్ తుగ్లక్ కాలానికి సంబంధించిన అంశాలు ఉంటాయట. ముందుగా తుగ్లక్ అనే టైటిల్ నే పరిశీలించారట. కానీ అశ్వథామ అనే టైటిల్ సౌండింగ్ బావుండడంతో దానినే ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఆరంభం నుంచే ఈ చిత్రంపై ఆసక్తి పెరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు.


Click it and Unblock the Notifications











