నాని నెక్స్ట్ మూవీ టైటిల్ పోస్టర్ విడుదల.. అంచనాలు పెంచేశారు!
నేచురల్ స్టార్ నాని తన జోరు కొనసాగిస్తున్నాడు. కృష్ణార్జున యుద్ధం చిత్రం పరాజయం చెందినప్పటికీ నాని జోరుని అడ్డుకోలేకపోయింది. ప్రస్తుతం నాని, నాగార్జున కలసి ఓ మల్టి స్టారర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నాని మరో చిత్రం కూడా ఖరారైంది. మళ్ళిరావా చిత్ర దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని నటించబోతున్నాడు.
తాజగా ఈ చిత్ర టైటిల్ పోస్టర్ ని విడుదల చేశారు. ఈ చిత్రానికి 'జెర్సీ' అనే టైటిల్ ఖరారు చేశారు. టైటిల్ పోస్టర్ డిజైన్ అంచనాలు పెంచే విధంగా ఉంది. ఓ క్రికెట్ క్రీడాకారుడు ఉపయోగించే వస్తువులన్నీ ఈ పోస్టర్ లో కనిపిస్తున్నాయి. ఇండియన్ క్రికెట్ జెర్సీపై అర్జున్ అనే పేరు, 36 నంబర్ ఉండడం విశేషం. దీని ద్వారా నాని పోషించబోయే పాత్ర పేరు అర్జున్ అని స్పష్టం అవుతోంది.
జెర్సీతో పాటు క్రికెట్ బ్యాట్, హెల్మెంట్ వంటి క్రీడా వస్తువులన్నీ కనిపిస్తుండడం విశేషం. నాని క్రికెటర్ గా నటించబోతున్నాడా అనే చర్చ మొదలైంది. జెర్సీ అనే టైటిల్ పై ' ఇట్స్ నెవర్ టూ లేట్ టు డ్రీం ' అనే ట్యాగ్ లైన్ కూడా ఉండడం విశేషం. మొత్తానికి ఈ పోస్టర్ ద్వారా జెర్సీ చిత్రం అందరి దృష్టిని ఆకర్షించింది.



Click it and Unblock the Notifications











