సాయిధరమ్ తేజ్ సినిమాకు ఇంటరెస్టింగ్ టైటిల్.. ఫన్నీగా ట్యాగ్ లైన్!

సాయిధరమ్ తేజ్ నటించిన తేజ్ ఐ లవ్ యు చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. తదుపరి చిత్ర ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు చకచకా జరిగిపోతున్నాయి. తేజు త్వరలో కిషోర్ తిరుమల దర్శకత్వంలో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం జులై నుంచి సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కాగా ఈ చిత్రానికి ఆసక్తికరమైన టైటిల్ ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. చిత్రలహరి అనే అందమైన టైటిల్ ఖరారు చేసారు. దీనికి ఫన్నీ ట్యాగ్ లైన్ కూడా ఉంది. బార్ అండ్ రెస్టారెంట్ అనేది ట్యాగ్ లైన్. కిషోర్ తిరుమల రొమాంటిక్ లవ్ స్టోరీలని అందంగా చిత్రీకరించగలరు.

Interesting title for Saidharam Tej next movie

ఆయన తెరకెక్కించిన నేను శైలజ చిత్రం మంచి విజయం సాధించగా, ఉన్నది ఒక్కటే జిందగీ పరవాలేదనిపించింది. తేజు నటించబోయే చిత్రానికి రితిక సింగ్, కళ్యాణి ప్రియదర్శన్ లని హీరోయిన్లు గా ఎంపిక చేశారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X