ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా.. ఆసక్తి రేపుతున్న టైటిల్స్, వర్షంలో బయటపడుతుంది!
వరుస విజయాలతో దూసుకుపోతున్న ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ చిత్రంలో నటిస్తున్నాడు. జైలవకుశ చిత్రంలో నట విశ్వరూపం ప్రదర్శించిన ఎన్టీఆర్.. త్రివిక్రమ్ చిత్రంలో కొత్త లుక్ కోసం ప్రయత్నిస్తున్నాడు. దీనికోసం ఎన్టీఆర్ కొన్ని నెలల పాటు హాలీవుడ్ ట్రైనర్ సమక్షంలో కసరత్తులు చేసిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, త్రివిక్రమ్ చిత్రం ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో శరవేగంగా షూటింగ్ జరుగుకుంటోంది. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న తొలి చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. తాజగా జరుగుతున్న ప్రచారం ప్రకారం ఈ చిత్రానికి రెండు ఆసక్తికరమైన టైటిల్స్ ని పరిశీలిస్తున్నారట.
Recommended Video


రాయలసీమ నేపథ్యంలో
రాయలసీమ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో త్రివిక్రమ్ ఎక్కువగా యాక్షన్ ఎపిసోడ్స్ పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ నుంచి అభిమానులు కోరుకునేది కూడా ఇదే. ఎన్టీఆర్ చిత్రంలో మాస్ యాక్షన్ అంశాలని అభిమానులు కోరుకుంటారు.

రైన్ ఫైట్‌లో
గత కొన్నినెలలుగా ఎన్టీఆర్ హాలీవుడ్ ట్రైనర్ సమక్షంలో కసరత్తులు చేసి సిక్స్ ప్యాక్ లుక్ ని పొందాడట. ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లుక్ రివీల్ చేసే సన్నివేసాలని త్రివిక్రమ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీల్లో చిత్రీకరిస్తునట్లు తెలుస్తోంది. వర్షంలో సాగె యాక్షన్ సన్నివేశంలో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లుక్ బయటపడుతుందని సమాచారం.

ఎన్టీఆర్ కోసం మాస్ టైటిల్స్
త్రివిక్రమ్ సినిమా అంటే సాధారణంగానే టైటిల్ ప్రకటన ఆలస్యం అవుతుంది. ఈ లోపు చిత్ర యూనిట్ పరిశీలిస్తున్న టైటిల్స్ అన్ని సోషల్ మీడియాలో చక్కర్లు కొడతాయి. ఎన్టీఆర్ సినిమా విషయంలో కూడా అదే జరుగుతోంది. ఈ చిత్రానికి రాయలసీమ, అసామాన్యుడు అనే టైటిల్స్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

దసరా టార్గెట్‌గా
ఈ చిత్రాన్ని దసరాకు విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇప్పటికె పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి తన పని మొదలు పెట్టానని ప్రకటించారు. అని అనుకున్నట్లు జరిగితే ఎన్టీఆర్, త్రివిక్రమ్ చిత్రం దసరాకు సందడి చేయడం ఖాయంగా కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











