సీసీ ఫుటేజీ ఆధారంగా దాసరి తనయుడి జాడలు.. పోలీసుల విచారణలో తేలిన నిజాలు

దాసరి నారాయణరావు పెద్ద కొడుకు దాసరి ప్రభు అదృశ్యమయ్యాడనే వార్త సినీ ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. ఈ నెల 9 వ తేదీన ఇంటినుంచి బయటికి వెళ్లిన దాసరి ప్రభు ఇప్పటి వరకూ జాడ లేకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు ఫిర్యాదు స్వీకరించిన హైదరాబాద్ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. అయితే ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు దాసరి ప్రభు ఈ నెల 9వ తేదీ సాయంత్రం సమయంలో బస్ ఎక్కి చిత్తూరు దిశగా వెళ్లాడని తెలుస్తోంది.

గత కొంతకాలంగా దాసరి కుటుంబంలో కలహాలు రాజుకుంటున్నాయి. దాసరి నారాయణరావు పెద్ద కొడుకు దాసరి ప్రభుకు, ఆయన భార్యకు మధ్య విభేదాలు తలెత్తడంతో 2008 లో కూడా దాసరి ప్రభు ఇలాగే అదృశ్యమయ్యాడు. దీంతో ప్రస్తుత కేసును కూడా అదే కోణంలో తీసుకొని ఆధారాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఇందులో భాగంగా పోలీసులు ఓ ప్రాథమిక అంచనాకు వచ్చారు.

Interesting Update On Dasari Prabhu missing Case

జూన్ 5 వ తేదీన రాత్రి చెన్నై నుండి హైదరాబాద్‌ వచ్చిన దాసరి ప్రభు.. ఓ రెండు రోజులు (7వ తేదీ వరకు) కూకట్‌పల్లిలో నివాసం ఉంటున్న తన పెద్దల్లుడు ఇంట్లో ఉన్నాడని, అయితే ఆ మరుసటి రోజు అంటే 8వ తేదీ ఉదయాన్నే పని ఉందని చెప్పి జూబ్లీహిల్ద్ రోడ్ నెంబర్ 46లో ఉన్న తన ఆఫీస్‌కి వెళ్లాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఆ రోజు రాత్రి తన ఇంట్లోనే పడుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అలాగే 9వ తేదీ సాయంత్రం వరకు ఇంట్లోనే ఆఫీస్ పనులు చూసుకున్న ప్రభు.. బయటకు వచ్చి చిత్తూరు బస్ ఎక్కినట్లు సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు గుర్తించారు.

పోలీసులు చేపట్టిన ప్రాథమిక విచారణ ఆధారంగా.. ఈ నెల 9 వ తేదీన ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన ప్రభుకి తన భార్య నుంచి ఫోన్ వచ్చిందని, అయితే ఫోన్ రింగ్ అయినా కాల్ కట్ అయిందని, ఆ తరువాత కొద్దిసేపటికే ఆయన ఫోన్ స్విచ్చాఫ్ అయినట్లు పోలీసులు తెలిపారు. విచారణ పూర్తి చేశాక తదుపరి వివరాలు తెలుపుతామని పోలీసులు చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X