Game Changer: అయ్యా బాబోయ్ శంకర్.. రాంచరణ్‌ను మళ్లీ ఇరికించేశాడుగా!

Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా లెజెండరీ డైరెక్టర్‌ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ 'గేమ్ చేంజర్' (Game Changer).వాస్తవానికి ఆర్ఆర్ఆర్ తరువాత చెర్రీకి ఆ రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ లేకపోవడంతో శంకర్- రామ్ చరణ్ కాంబోలో సినిమా అనగానే.. ఈ సినిమా మీద మెగా ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగానే రామ్ చరణ్ కూడా తన బెస్ట్ ఇవ్వడానికి చాలా ప్రయత్నించారు.

ఒక్కటి కాదు.. రెండు కాదు.. దాదాపు 3 ఏళ్లపాటు 'గేమ్ ఛేంజర్'(Game Changer)కోసం అంకితమైపోయాడు మెగా పవర్ స్టార్. జూలై నెల ఆరంభంలో రామ్ చరణ్ పార్ట్ షూటింగ్ పూర్తి అయింది. ఈ విషయాన్ని డైరెక్టర్ శంకర్ నేరుగా మీడియాతో చెప్పారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్స్ మాత్రమే మిగిలి ఉన్నాయని ప్రకటించారు. ఇక పండగే.. ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న మెగా ఫ్యాన్స్ కే కాదు.. హీరో రామ్ చరణ్ కూడా భారీ షాక్ ఇచ్చారంట డైరెక్టర్ శంకర్.

Interesting update on Game Changer movie Shankar requested 4 to 5 days of reshoots with Ram Charan

వాస్తవానికి గేమ్ ఛేంజర్ సినిమాతో పాటుగా భారతీయుడు 2 సినిమా షూటింగ్ కూడా చేశారు శంకర్. ఈ సినిమా కంటే ముందే భారతీయుడు 2 సినిమాను విడుదల చేశారు. ఒకప్పటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాకి సీక్వల్ గా వచ్చిన ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా ఫెల్యూర్ తరువాత డైరెక్టర్ శంకర్ పై అనుమానాలు వస్తున్నాయి. ఆయనపై ఫ్యాన్స్ లో నమ్మకం సన్నగిల్లుతోంది. ఈ తరం ఫ్యాన్ ను మెప్పించలేకపోతున్నారంటూ ట్రోల్స్ వైరలవుతున్నాయి.

భారతీయుడు 2 డిజాస్టర్ తో శంకర్ కి గేమ్ ఛేంజర్ మూవీ ప్రెస్టేజ్ ఇష్యూ గా మారింది. దీనితో చిన్న తప్పు కూడా ఉండకూడదని శంకర్ భావిస్తున్నారు. ఎడిట్ తరువాత హీరో రామ్ చరణ్ నటించిన కొన్ని సీన్లు మార్చాలని శంకర్ భావిస్తున్నారంట. మళ్ళీ కొంత ప్యాచ్ వర్క్ చేయాలని డిసైడ్ అయ్యాడట. దీంతో మరో నాలుగు, ఐదు రోజులు చరణ్ డేట్స్ కావాలని నిర్మాత దిల్ రాజుని అడిగాడట. రీ షూట్ చేయడానికి చరణ్ డేట్లు కొన్ని రోజులు అవసరం అవుతాయి. దీంతో తాజాగా మూవీ మేకర్స్ రామ్ చరణ్ కి ఫోన్ చేసి ఒక నాలుగు లేదా ఐదు రోజులు షూటింగ్ కోసం డేట్లు అడిగినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. రామ్ చరణ్ తన 16వ మూవీని బుచ్చిబాబు సనతో చేయబోతున్న విషయం తెలిసిందే. చాలా రోజుల క్రితమే ఈ మూవీకి సంబంధించిన ప్రకటన వెలువడింది. వీరిద్దరి క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకటేష్ సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. అలాగే, ఈ మూవీకి మైత్రీ మూవీ మేకర్స్‌తో పాటు సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మాణ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి. దీనికి ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోందంట.

Interesting update on Game Changer movie Shankar requested 4 to 5 days of reshoots with Ram Charan

ఈ మూమెంట్ లో రామ్ చరణ్ డేట్స్ దొరకడం చాలా కష్టం. అలాగే.. మళ్లీ షూటింగ్ అంటే కూడా నిర్మాత దిల్ రాజుకు భారమే. బుచ్చిబాబు సినిమా కూడా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కానీ, సినిమా పర్పెక్ట్ గా రావాలంటే.. మాత్రం మూవీ మేకర్స్ చరణ్ ని బ్రతిమాలాల్సిందే. చివరి దశలో ఉన్నా ఈ భారీ ప్రాజెక్ట్ కు రామ్ చరణ్ కూడా ఓకే అనాల్సిందే.

ఏదిఏమైనా.. ఓ సినిమా షూటింగ్ లో ప్రారంభించగా.. ఇలాంటి రీ షూటింగ్స్ అంటే.. కొంచెం కష్టమే.. ఈ నేపథ్యంలో మెగా ఫ్యాన్స్ లో కాస్త కంగారు మొదలైంది. గేమ్ చేంజెర్ సినిమా ఎలా ఉండబోతుందనే అనుమానం ప్రారంభమైంది. మరోవైపు.. ఈ పనితో డైరెక్టర్ శంకర్.. రాంచరణ్‌ను ఇరకాటంలో పడేశాడుగా అంటున్నారు మూవీ లవర్స్.

More from Filmibeat

Read more about: ram charan shankar game changer
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X