సైరాలో సన్నివేశాలు తొలగింపు.. మరీ ఎక్కువైపోయిందా, రాంచరణ్‌కు నచ్చితేనే!

Recommended Video

Interesting Update On Megastar Chiranjeevi's SyeRaa NarasimhaReddy Movie || Filmibeat Telugu

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి. తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మెగాపవర్ స్టార్ రాంచరణ్ స్వయంగా ఈ చిత్రాన్ని 200 కోట్ల భారీ బడ్జెట్ లో నిర్మిస్తుండడం విశేషం. సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. నరసింహారెడ్డి వీరత్వాన్ని ప్రతిభింబించేలా ఈ చిత్రం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా, తమన్నా, అమితాబ్ బచ్చన్, విజయ సేతుపతి లాంటి నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా సైరా షూటింగ్ కు సంబంధించిన ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది.

 అవుట్ పుట్ నచ్చిన తర్వాతే

అవుట్ పుట్ నచ్చిన తర్వాతే

గత ఏడాది కాలంగా సైరా షూటింగ్ జరుగుతూనే ఉంది. చారిత్రాత్మక నేపథ్యం ఉన్న చిత్రం, భారీ బడ్జెట్ కావడంతో అన్ని జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ చేస్తున్నారు. ప్రముఖ హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్స్ సైరా చిత్రం కోసం పనిచేస్తున్నారు. సైరా చిత్ర విడుదల తేదీ ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. ఆ మధ్యన రాంచరణ్ మాట్లాడుతూ ఈ ఏడాది ద్వితీయార్థంలో మాత్రం విడుదల చేస్తాం అని తెలిపాడు. కానీ సైరా చిత్ర అవుట్ పుట్ నచ్చి, అంతా ఓకే అయిన తర్వాత మాత్రమే రిలీజ్ డేట్ ప్రకటించాలని చరణ్ భావిస్తున్నాడట.

సన్నివేశాల తొలగింపు

సన్నివేశాల తొలగింపు

సైరా చిత్రానికి ముందుగా 200 కోట్ల బడ్జెట్ అనుకున్నారు. కానీ కొన్ని అనవసర సన్నివేశాల వల్ల బడ్జెట్ పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది. దీనితో దర్శకుడు సురేందర్ రెడ్డి స్క్రిప్ట్ లో ఉన్న కొన్ని ప్రాధాన్యత లేని సన్నివేశాల్ని తొలగిస్తున్నారట. కథని రచించే సమయంలో అన్ని అంశాలని స్క్రిప్ట్ లో పొందుపరిచారు. కథ పెద్దదైపోవడం, బడ్జెట్ పెరిగిపోతుండడంతో సురేందర్ రెడ్డి అవసరమైన మేరకు మాత్రమే షూటింగ్ చేస్తూ మిగిలిన సీన్స్ ని తొలగిస్తున్నట్లు తెలుస్తోంది.

పోస్ట్ ప్రొడక్షన్

పోస్ట్ ప్రొడక్షన్

సైరా షూటింగ్ మరి కొద్దిరోజుల్లో ముగియనుంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేస్తారు. సైరా చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్ కు ఎక్కువ ప్రాధ్యానత ఉంటుంది. కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కూడా చిత్ర యూనిట్ ఎక్కువ సమయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్రకు సంబంధించిన అధికారిక రచనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

బ్రేక్ తీసుకున్న చిరు

బ్రేక్ తీసుకున్న చిరు

ఇటీవల చిరంజీవి సైరా షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుని తన సతీమణి సురేఖతో జపాన్ టూర్ వెళ్ళాడు. త్వరలో తిరిగి షూటింగ్ లో పాల్గొననున్నాడు. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. సైరా కోసం అతడు 5 పాటలని కంపోజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నయనతార చిరంజీవి సరసన నటిస్తోంది. తమన్నా, జగపతి బాబు, బిగ్ బి అమితాబ్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి లాంటి ప్రముఖునటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X