రానే వచ్చాడు ఆ రామయ్య.. మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఊపందుకున్న ఊహాగానాలు!

Recommended Video

Nandamuri Mokshagna Enters Tollywood Soon ?

నందమూరి కుటుంబం నుంచి మరో వారసుడు ఎప్పుడువస్తాడని అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని నటుడిగా బాలయ్య శిఖరం స్థాయికి చేరాడు. ఆ తరువాత వచ్చిన ఎన్టీఆర్ అదరగొడుతున్నాడు. కళ్యాణ్ రామ్ రాణిస్తున్నాడు. ఈ తరుణంలో బాలయ్య తనయుడు నందమూరి మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశం ఎప్పుడు అనే చర్చ మరో మారు మొదలైంది.

21వ ఏళ్ల వారసుడు

21వ ఏళ్ల వారసుడు

నిన్ననే మోక్షజ్ఞ 21 వ ఏట లోకి అడుగుపెట్టాడు. సెప్టెంబర్ 6 న మోక్షజ్ఞ జన్మదినం. గత ఏడాది నుంచి మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశానికి సంబంధించి ఏదోఒక చర్చ జరుగుతూనే ఉంది. మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు, ఏ దర్శకుడు మోక్షజ్ఞని లాంచ్ చేయబోతున్నాడు అనే చర్చ అభిమానుల్లో జరుగుతోంది.

స్టార్ హీరోలంతా

స్టార్ హీరోలంతా

ప్రస్తుతం టాలీవడ్ లో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారంతా యంగ్ ఏజ్ లోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. బన్నీ 20 ఏళ్లకు, ప్రభాస్ 22, రాంచరణ్ 21 ఏళ్లకు హీరోలుగా మారినవారే. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ అయితే 16 ఏళ్ల టీన్ ఏజ్ లోనే హీరోగా మారాడు.

గ్రీన్ సిగ్నల్

గ్రీన్ సిగ్నల్

బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే మోక్షజ్ఞని లాంచ్ చేయడానికి బోలెడంత మంది దర్శకులు, నిర్మాతలు క్యూలో ఉన్నారు. కానీ బాలయ్య మాత్రం సరైన సమయం కోసం వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది గౌతమి పుత్ర శాతకర్ణి విడుదుల సమయం నుంచి బాలయ్యకు ఈ ప్రశ్నలు ఎదురయ్యాయి.

రానే వచ్చాడు ఆ రామయ్య

రానే వచ్చాడు ఆ రామయ్య

లెజెండ్ చిత్రంతో బాలయ్యకు సన్నిహితుడిగా మారిన సాయి కొర్రపాటి మోక్షజ్ఞని లాంచ్ చేయడానికి ఉవ్విళ్లూరుతున్నట్లు తెలుస్తోంది. బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇస్తే సినిమా మొదలు పెట్టాలని 'రానే వచ్చాడు ఆ రామయ్య' అనే ఆసక్తికరమైన టైటిల్ రిజిస్టర్ చేయించినట్లు వార్తలు వస్తున్నాయి.

ఎట్టి పరిస్థితుల్లో

ఎట్టి పరిస్థితుల్లో

ప్రస్తుతం బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాదికి పూర్తవుతుంది. ఆ తరువాత మోక్షజ్ఞ ఎంట్రీపై బలయ్య దృష్టి పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఎట్టి పరిస్థితుల్లో మోక్షజ్ఞ సినిమా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఊహాగానాలు జోరందుకున్నాయి.

నటనలో మెళుకువలు

నటనలో మెళుకువలు


ప్రస్తుతం మోక్షజ్ఞ సీక్రెట్ గా తన కసరత్తులు పూర్తి చేస్తున్నాడట. ఫిజిక్, నటనలో మెళుకువలు, డాన్సులపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మోక్షజ్ఞ వచ్చే పుట్టిన రోజు నాటికీ తొలి చిత్రాన్ని ప్రారంభించి నందమూరి అభిమానుల కోరిక తీరుస్తాడేమో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X