చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రేపటి నుంచే...
రెండేళ్లకొకసారి హైద్రాబాద్‌లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవం రేపటి నుంచి ప్రారంభం కానుంది. రేపు 14 నుంచి 20వ తారీఖు వరకు వారం రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో 20 దేశాలనుంచి 70 సినిమాలు ప్రదర్శితమవుతాయి. ఈ వివరాలు వెల్లడించడానికి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఫిలిం ఫెస్టివల్ చైర్ పర్సన్ నందితాదాస్, సిఈవో సుశోవన్ బెనర్జీ, రాష్ట్ర సమాచారశాఖ మంత్రి గీతారెడ్డి, చలనచిత్ర అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరక్టర్ సి.పార్థసారధి, యునిసెఫ్ ప్రతినిధి కరేన్ హుల్షుఫ్, జ్యూరీ మెంబర్ నగేష్ కుకునూర్ తదితరులు పాల్గొన్నారు. 14వ తేది సాయంత్రం ఆరన్నర గంలకు కేంద్ర సమాచారశాఖ మంత్రి అంబికాసోని చేతుల మీదుగా పబ్లిక్ గార్డెన్స్‌లోని లలిత కళాతోరణంలో 'ఫిలిం ఫెస్టివల్" ప్రారంభమవుతుందని, ముఖ్యమంత్రి కె.రోశయ్య ముఖ్య అతిధిగా పాల్గొంటారని చెప్పారు. వివిధ దేశాల నుంచి 400 మంది బాల ప్రతినిధులతోపాటు 100 మంది ప్రతినిధులు పాలుపంచుకుంటారని తెలిపారు.


Click it and Unblock the Notifications











