twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవం ప్రారంభం

    By Bojja Kumar
    |

    అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం హైదరాబాద్ లో సోమవారం ఘనంగా ప్రారంభం అయింది. ఈనెల 14 నుంచి 20వరకు జరిగే చిత్రోత్సవాలకోసం శిల్పారామంలో 3 స్క్రీన్లు, హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లలో 10 స్క్రీన్లను ఏర్పాటుచేశారు. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ కు ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన 700 ఎంట్రీల్లో 152 చిత్రాలు ప్రదర్శనకు అర్హత సాధించాయి. వాటిల్లో 4 చిత్రాలు రాష్ట్రం నుంచి వచ్చాయి. 600 మంది విదేశీ అతిథులు సహా దాదాపు లక్షన్నర మంది బాలలు రాష్ట్ర నలుమూలలనుంచి హైదరాబాద్‌ వచ్చి బాలల చిత్రాలను వీక్షిస్తారు. పిల్లలకు అవసరమైన రవాణా, ఆహార సదుపాయాలు, ఇతర వసతులను ఏర్పాటు చేశారు.

    బాలల చిత్రాల్లో అవార్డులు వచ్చినవారికి ప్రభుత్వం ప్రత్యేకించి రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తోందని మంత్రి డికె అరుణ చెప్పారు. ఈ ఉత్సవాలు వేరే చోటికి తరలిపోయే పరిస్థితి వచ్చినా.. మొదట అనుకున్నట్టే జరగాలని సి.ఎం. పట్టుదలతో సాయశక్తులా కృషిచేశారని తెలిపారు. ఉత్సవాలకు రూ.5 కోట్లు ఖర్చు చేస్తున్నామని, సినిమాలు వీక్షించడానికి వచ్చే బాలలకు అవసరమయ్యే అన్ని వసతులు ఏర్పాటు చేశామని అరుణ హామీ ఇచ్చారు. ఏవైనా చిన్నపాటి పొరపాట్లున్నా దాన్ని పెద్దది చేయవద్దని విజ్ఞప్తి చేశారు.

    ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వాహణ కమిటీ ఛైర్‌పర్సన్‌ నందితాదాస్‌ మాట్లాడుతూ 2009లో అంతర్జాతీయ చలనచిత్స్రోవాల బాధ్యత తీసుకున్నా. అప్పటికి ఇప్పటికి మన ఇండియన్‌ సినిమాల్లో మార్పులు వచ్చాయి. గతంలో కంటే ఈసారి భారతీయ సినిమాలు పెరిగాయి. అందులో లిటిల్‌ డైరెక్టర్స్‌ కూడా ఉన్నారు. ముంబై, చెన్నై, కొల్‌కత్తా లాంటి చోట్ల ఈ ఉత్సవాలు బాగా జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్‌ కూడా బాగానే కృషి చేస్తోంది. పిల్లలకు బాగా ఆహ్లాదకరమైన శిల్పారామంలో ఏర్పాటుచేయడం సముచితంగా ఉందన్నారు.

    English summary
    The 17th International Children's Film Festival opens in Hyderabad today, November 14, and will be on till November 20.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X