»   » హైదరాబాద్ లో బాలల చలన చిత్రోత్సవం..డిటేల్స్

హైదరాబాద్ లో బాలల చలన చిత్రోత్సవం..డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Nanditha Das
17వ ప్రపంచ బాలల చిత్రోత్సవాన్ని నవంబర్ 14 నుంచి 20 వరకు హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ చైర్‌పర్సన్ నందితా దాస్ వెల్లడించారు. సచివాలయంలో సీఎం కిరణ్, సినిమాటోగ్రఫీ మంత్రి డీకే. అరుణలతో ఆమె కార్యక్రమం నిర్వహణపై చర్చించారు. ప్రతి రెండేళ్లకొకసారి నిర్వహించే ఈ చిత్రోత్సవాన్ని ఈ సారి హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. వారం రోజులపాటు జరిగే ఈ ప్రదర్శనలో 40 దేశాల్లో అవార్డులు సాధించిన చిన్నపిల్లల సినిమాలు 100కు పైగా ప్రదర్శిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బాల దర్శకుల్ని కూడా పరిచయం చేయబోతున్నామని చెప్పారు.

రాష్ట్ర చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధి సంస్థ తరపున ఈ చిత్రోత్సవానికి అన్నివిధాలా తోడ్పాటును అందిస్తున్నట్లు మంత్రి అరుణ తెలిపారు. హైదరాబాద్‌లో గతంలో ఈ చిత్రోత్సవం జరిగినప్పుడు పలు సినిమా హాళ్లలో ప్రదర్శనలు జరిగాయని, ఫలితంగా చిన్నపిల్లలు అటు ఇటు తిరగటానికి ఇబ్బంది పడ్డారని ఆమె అన్నారు. ఇప్పుడు అలాంటి సమస్య తలెత్తకుండా శిల్పారామం లాంటి చోట్లను పరిశీలిస్తున్నామని తెలిపారు.

English summary
The 17th International Children's Film Festival (ICFF) will be held from November 14 in Hyderabad, state Information Minister D K Aruna said. According to the state Information Minister D K Aruna, the seven-day event will be held between November 14 and 20.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu