»   » 18వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం నేటి నుండి ప్రారంభం

18వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం నేటి నుండి ప్రారంభం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని లలిత కళా తోరణంలో 18వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవ వేడుకలు ఈ రోజు సాయంత్రం ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం లలిత కళా తోరణంలో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసారు. పెద్ద పెద్ద తెరలతో, చిన్నారులను ఆకట్టుకునే విధంగా వేదిక సిద్దం చేసారు.

దీంతో పాటు లిలితా కళాతోరణంలో చిన్నారులను ఆకట్టుకునే విధంగా ఏర్పాట్లు చేసారు. గురువారం సాయంత్రం ఐదున్నర గంటలకు నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లోని లలిత కళా తోరణంలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యే 18వ బాలల దినోత్సవానికి కేంద్రమంత్రి మనీష్ తివారీ, బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, గుల్జార్, రాష్ట్ర ముఖ్య నేతలు పాల్గొంటారు. శుక్రవారం నుండి నగరంలో ఏర్పాటు చేసిన వివిధ థియేటర్లలో పిల్లల కోసం సినిమాలను ప్రదర్శిస్తారు.

స్లైడ్ షోలో 18 అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించిన ఫోటోలతో పాటు, బాలల రిహార్సల్స్ కార్యక్రమాల ఫోటోలు, బాలల దినోత్సవం ఎందుకు జరుపుకుంటారనే విషయాలు తెలుసుకుందాం.

జవహర్ లాల్ నెహ్రూ

జవహర్ లాల్ నెహ్రూ


మనకు చాలా మంది దేశ నాయకులుండగా జవహర్‌లాల్‌ నెహ్రూ పుట్టినరోజునే బాలల దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటావో తెలుసా... పిల్లలంటే ఆయనకు చాలా చాలా ప్రేమ కాబట్టి! నెహ్రూ మన దేశానికి మొదటి ప్రధానమంత్రి. ఆ పదవిలో ఉండేవారికి ఎన్నో బాధ్యతలుంటాయి. తీరిక అస్సలే ఉండదు. కానీ ఆయన మాత్రం అంత పని వత్తిడిలోనూ ఎలాగోలా వీలు చేసుకొని పిల్లలతో మాట్లాడేవారు. పిల్లలంతా ఆయన్ని ప్రేమగా 'చాచా' అని పిలిచేవారు.

బాలల దినోత్సవం

బాలల దినోత్సవం


ప్రతి సంవత్సరం నవంబరు 14న బాలల దినోత్సవం జరుపుకుంటాము. భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం రోజున ఈ ఉత్సవం జరుగుతుంది. భారత తపాళా శాఖ ప్రతి సంవత్సరం ఈ రోజు తపాలా బిళ్ళను విడుదల చేస్తుంది.

బాల్యం..ఓ వరం

బాల్యం..ఓ వరం


అందరూ అనుభవించే బాల్యం.. భగవంతుడు ఇచ్చిన ఓ అమూల్యమైన వరం. అభం శుభం తెలియని ఆ పసి మనసులు పూతోటలో అప్పుడే పరిమళించిన పువ్వులు. అటువంటివారి పేరిట బాలల దినోత్సవం వేడుకను నిర్వహించటం వారిలో నూతనోత్తేజాన్ని ఇస్తాయి.

పాఠశాలల్లో వేడుకలు

పాఠశాలల్లో వేడుకలు


ఈ బాలల దినోత్సవం నాడు ప్రతి పాఠశాలలోనూ ప్రత్యేకంగా వేడుకలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా చిన్నారులకు వివిధ రకాల పోటీలు, సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బాలల్లో ఉండే నైపుణ్యాలను వెలికితీసేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని పాఠశాలల యాజమాన్యాలు చెబుతున్నాయి.

నిరుపేదల బాలలు

నిరుపేదల బాలలు


పేద, నిరుపేద కుటుంబాలకు చెందిన కొంతమంది చిన్నారులు అతి చిన్న వయసులోనే పలకా బలపం పట్టాల్సిన చేతులతో తట్ట, పార పట్టి పనులకు వెళ్లడం ప్రతినిత్యం మనం చూస్తునే ఉన్నాం. దీనికి ఆ తల్లి దండ్రుల్లో ఉన్న నిరక్షరాస్యత కొంత కారణమైతే ఆ కుటుంబాలు ఆర్ధిక స్ధితి గతులు మరో కారణంగా చెప్పవచ్చు.

బాలల దినోత్సవ చరిత్ర

బాలల దినోత్సవ చరిత్ర


ఒకసారి బాలల దినోత్సవం చరిత్రను మననం చేసుకుందాం. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం బాలల దినోత్సవాన్ని నవంబర్ 20న అధికారికంగా జరుపుకుంటుంటారు. అయితే 1959కి ముందు అక్టోబర్ నెలలో బాలల దినోత్సవాన్ని జరుపుకునేవారు.

ఐక్యరాజ్య సమితి నిర్ణయం

ఐక్యరాజ్య సమితి నిర్ణయం


ఐక్యరాజ్యసమితి నిర్ణయించిన ప్రకారం బాలల దినోత్సవాన్ని మొదటిసారిగా 1954లో ప్రపంచమంతటా నిర్వహించారు.1959 నవంబర్ 20న బాలల హక్కుల ప్రకటనను ఐరాస సర్వసభ్య సభ రూపొందించిన సందర్భంగా బాలల దినోత్సవాన్ని ప్రపంచ మంతటా జరుపుకోవాలని నిర్ణయించారు.

పిల్లల హక్కులపై బిల్లు

పిల్లల హక్కులపై బిల్లు


1989లో పిల్లల హక్కులపై నవంబర్ 14న ఓ బిల్లును ఐరాస ఆమోదించింది. ఈ బిల్లును ఆమోదిస్తూ 191 దేశాలు సంతకాలు పెట్టాయి కూడా. పిల్లలు తమ భావాలను, సమాచారాన్ని పంచుకోవడాన్ని, పరస్పర అవగాహనను పెంచుకోవడాన్ని ప్రోత్సహించేందుకు గాను ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ బాలల దినోత్సవానికి రూపకల్పన చేసింది. ప్రపంచమంతటా పిల్లల సంక్షేమాన్ని ప్రోత్సహించేందుకోసం పలు చర్యలు చేపట్టడం ఈ దినోత్సవం లక్ష్యం.

వివిధ దేశాల్లో..

వివిధ దేశాల్లో..


నవంబర్‌ 14 భారతీయ బాలలకు ఎంతో ఇష్టమైన రోజు. ప్రభుత్వం అధికారికంగా వారికోసం కేటాయించిన ఒక్కగానొక్క రోజది. అయితే బాలల దినోత్సవాన్ని మనలాగా ప్రపంచదేశాలన్నీ అదే రోజున జరుపుకోవు. ఒక్కో దేశం ఒక్కో రోజున జరుపుకుంటుంది.

చైనాలో...

చైనాలో...


చైనాలో జూన్‌ 1వ తేదీన బాలల దినోత్సవం జరుపుకుంటారు. శుభాకాంక్షలు చెప్పుకుని పాఠశాలల్లో ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోజు పాఠశాలలు తెరిచివున్నా తరగతులు జరగవు.

పాకిస్థాన్ లో...

పాకిస్థాన్ లో...


మన పొరుగు దేశమైన పాకిస్తాన్‌లో నవంబర్‌ 20వ తేదీన బాలల దినోత్సవం జరుపుకుంటారు. ఆరోజున పాఠశాలలు మామూలుగానే నడుస్తాయి. టీవీలు, రేడియోల్లో మాత్రం ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేస్తారు.

జపాన్ దేశంలో...

జపాన్ దేశంలో...


జపాన్‌లో మే 5న జరుపుకుంటారు. ఆరోజున మగపిల్లలున్న వారు చేప ఆకారంలో వున్న గాలిపటాలను ఎగురవేస్తారు. అంతేకాక యుద్ధవీరుల బొమ్మలతో కొలువు ఏర్పాటుచేస్తారు. ఆరోజు జాతీయ సెలవుదినంగా కూడా ప్రకటిస్తారు.

దక్షిణ కొరియాలో...

దక్షిణ కొరియాలో...


దక్షిణ కొరియాలో మే 5వ తేదీన బాలల దినోత్సవం జరుపుకుంటారు. ఆరోజున ఇక్కడ పిల్లలకోసం ఎక్కువ సమయం కేటాయిస్తారు. వారు ఎప్పుడూ గుర్తుంచుకునేలా పెద్దలు పిల్లలకోసం ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఎక్కడికైనా బయటకు తీసుకెళతారు.

పోలండ్ లో...

పోలండ్ లో...


పోలాండ్‌లో జూన్‌ 1న బాలల దినోత్సవం చేసుకుంటారు. ఆరోజున స్కూళ్లల్లోనే రకరకాల కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. పార్కుల్లో, వినోద కేంద్రాలలో పిల్లలకోసం ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు.

శ్రీలంకలో..

శ్రీలంకలో..


శ్రీలంకలో అక్టోబర్‌ 1 అంటే పండుగే. పెద్దలు తప్పనిసరిగా వారిని బయటకు తీసుకెళతారు. ఇళ్లల్లో వారికోసం ప్రత్యేకంగా స్వీట్లు చేస్తారు. ఇవేకాక వివిధ దేశాలలో బాలలదినోత్సవాలను ఒక్కోరోజు జరుపుకుంటున్నారు.

English summary
The 18th edition of the International Children’s Film Festival India (ICFFI) will be held between November 14 and 20 at Hyderabad. At a press conference regarding the upcoming event, the additional director PIB chennai put forward details regarding the event which is entering its eighth year at Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu