అలా చేస్తే ప్లాప్ అవుతున్నాయి, నన్నేం చేయమంటారు?: రవితేజ

రవితేజ హీరోగా త్వరలో 'టచ్ చేసి చూడు చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బేబీ భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) , వల్లభనేని వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా విక్రమ్ సిరికొండ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌ం అవుతున్నాడు. రాశీఖ‌న్నా, సీర‌త్ క‌పూర్ హీరోయిన్లు. ఫిబ్ర‌వ‌రి 2న సినిమా విడుదలవుతున్న సందర్భంగా రవితేజ మీడియాతో సినిమాకు సంబంధించిన విషయాలపై ముచ్చటించారు.

Recommended Video

కొత్తదనం కోసం చూస్తే దెబ్బే... అందుకే ఆ సినిమాలు ఫ్లాప్ !
 సినిమాలో తన పాత్ర గురించి రవితేజ

సినిమాలో తన పాత్ర గురించి రవితేజ

ఇప్పటికే నేను పలు చిత్రాల్లో పోలీస్ పాత్రలు చేశాను. అవన్నీ సీరియస్‌గా ఉండే పాత్రలు. కానీ ఈ చిత్రంలోనూ సీరియ‌స్‌ పాత్రే అయినా కాస్త వ్యంగం, కాస్త ఫన్ ఉంటుంది. చాలా ట‌ఫ్ అండ్ డ్యూటీ మైండెడ్ పోలీస్ ఆఫీస‌ర్‌గా ఇందులో కనిపించబోతున్నాను అని రవితేజ తెలిపారు.

 దర్శకుడి గురించి

దర్శకుడి గురించి

దర్శకుడు విక్రమ్ సిరికొండ నాకు ‘మిరపకాయ్' చిత్రం నుండే పరిచయం. వి.వి.వినాయ‌క్ ద‌గ్గ‌ర అసిస్టెంట్‌గా ప‌నిచేశాడు. తర్వాత రైట‌ర్‌, స్క్రీన్‌ప్లే రైట‌ర్‌గా ఎదిగాడు. విక్రమ్ నాకు ఒక క‌థ చెప్పాడు. కానీ ఇతర కమిట్మెంట్స్ వల్ల చేయలేక పోయాను. ఇంతలో వక్కతం వంశీ బుజ్జికి కథ చెప్పడం, నాకు కూడా ఆ కథ నచ్చడంతో ఈ చిత్రానికి విక్కమ్ సిరికొండను దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. అతడికి ఇది తొలి సినిమా అయినా అనుభవజ్ఞుడిలా చేశాడు.... అని రవితేజ తెలిపారు.

ఆ సినిమాలో కంపేర్ చేయొద్దు

ఆ సినిమాలో కంపేర్ చేయొద్దు

ఈ చిత్రం గతంలో మీరు చేసిన హిట్ మూవీ ‘విక్రమార్కుడు' తరహాలో ఉంటుందా? అనే ప్రశ్నకు రవితేజ స్పందిస్తూ..... ఈ చిత్రాన్ని ఇతర సినిమాలతో కంపేర్ చేయొద్దని, ఆ సినిమా ఆ సినిమానే, ఈ సినిమా ఈ సినిమానే... అందరికీ నచ్చుతుంది అని రవితేజ తెలిపారు.

ఆ అమ్మాయి డామినేషన్ ఉంటుంది

ఆ అమ్మాయి డామినేషన్ ఉంటుంది

ఈ సినిమాలో సీరత్ కపూర్ మిమ్మల్ని బాగా డామినేట్ చేస్తుందని అంటున్నారు. దీనిపై మీ స్పందన ఏమిటి? అనే ప్రశ్నకు రవితేజ స్పందిస్తూ.... నా రోల్ మీద ఆమె డామినేషన్ కొంచెం ఉంటుంది. ఇందులో ఆమె అల్ట్రా మోడ్ర‌న్‌గా ఉంటుంది. సీరత్ కపూర్‌తో పాటు రాశీఖ‌న్నా పాత్ర కూడా బావుంటుంది.... అని రవితేజ తెలిపారు.

 అది ఇపుడు విడుదలైతే హిట్టయ్యేదేమో?

అది ఇపుడు విడుదలైతే హిట్టయ్యేదేమో?

నా ఆటోగ్రాఫ్‌లాంటి సినిమాలు మ‌ళ్లీ చేస్తారా అనే ప్రశ్నకు రవితేజ స్పందిస్తూ..... ఆటోగ్రాఫ్ ఇప్పుడు విడుద‌లై ఉంటే త‌ప్ప‌కుండా హిట్ అయ్యేదేమో, అప్పటికీ ఇప్పటికీ ఆడియన్స్ మైండ్ సెట్ చాలా మారింది. ఈ మధ్య అలాంటి కొన్ని స్క్రిప్ట్స్ విన్నాను, వీలైతే తప్పకుండా చేస్తాను అని తెలిపారు.

 అలా చేస్తే సినిమాలు ప్లాప్ అవుతున్నాయి

అలా చేస్తే సినిమాలు ప్లాప్ అవుతున్నాయి

మీ శైలి కథలు తప్ప కొత్త తరహా కథలు ట్రై చేయడం లేదు? ఎందకని అనే ప్రశ్నకు రవితేజ స్పందిస్తూ.... కొత్త‌ద‌నం కోసం ఆలోచిస్తే సినిమాలు ఆడ‌టం లేదు. నేను కొత్త‌గా చాలా సినిమాలు ట్రై చేశాను. కానీ అవేమీ క‌మ‌ర్షియ‌ల్‌గా వ‌ర్కవుట్ కాలేదు. ఆటోగ్రాఫ్, ఈ అబ్బాయి చాలా మంచోడు, నేనింతే, శంభో శివశంభో... ఇలా చాలా చేశాను. ఇవన్నీ కమర్షియల్‌గా ప్లాప్ అయ్యాయి. ఇపుడంతా ఎంటర్టెన్మెంట్ ఉంటేనే నడుస్తున్నాయి. నా ప్ర‌యారిటీ ఎంట‌ర్‌టైన్మెంటే..... ఒక్కో దర్శకుడు ఒక్కో రకంగా వారి వారి స్టైల్ బట్టి చూపిస్తాడు. అందుకే నేను కూడా ఎంటర్టెన్మెంట్ ఉన్న కథలనే ఎంచుకుంటున్నాను అని రవితేజ తెలిపారు.

అదంతా రాజమౌళి వల్లే

అదంతా రాజమౌళి వల్లే

రాజమౌళి వల్ల తెలుగు సనిమా మార్కెట్ పెరిగింది. నాకు అవకాశం వస్తే తమిళం, హిందీ భాషల్లో కూడా సినిమాలు చేస్తాను. ‘రాజా ది గ్రేట్‌' షూటింగ్‌ కోసం డార్జిలింగ్‌ వెళ్లా. రోడ్డుపై షూటింగ్‌ చేస్తుంటే నన్ను చూసి అక్కడివాళ్లంతా అరిచేవారు. విషయమేంటంటే టీవీల్లో హిందీ డబ్బింగ్‌ సినిమాలు చూడడం వల్ల వాళ్ల హీరోలుగా మారిపోయాం. అందుకే మనల్ని గుర్తు పడుతున్నారు.... అని రవితేజ తెలిపారు.

శ్రీను వైట్లతో సినిమా గురించి

శ్రీను వైట్లతో సినిమా గురించి

శ్రీనువైట్ల‌గారి సినిమాలో ఎలాంటి పాత్ర చేస్తున్నారు?... అనే ప్రశ్నకు రవితేజ స్పందిస్తూ.... ఆ విషయం ఇప్పుడే చెప్పను అని సమాధానం ఇచ్చారు.

 డైరెక్షన్

డైరెక్షన్

ద‌ర్శ‌క‌త్వం ఎప్పుడు? చేస్తారు అనే ప్రశ్నకు స్పందిస్తూ..... చేస్తాను. కానీ అందులో నేను న‌టించ‌ను. ఇప్పుడు న‌ట‌న‌ను ఎంజాయ్ చేస్తున్నాను, దాని గురించి తర్వాత ఆలోచిస్తాను అన్నారు...... అని రవితేజ తెలిపారు.

 కొడుకు గురించి

కొడుకు గురించి

రాజా ది గ్రేట్‌లో నా కొడుకు మ‌హాధ‌న్‌ని ప‌రిచ‌యం చేసింది నేను కాదు, అనిల్ చేశాడు. అతడు అడగటం వల్లే నటించాడు. చాలా బాగా చేశాడు. కొంత‌మంది అయితే నీక‌న్నా బాగా చేశాడు అని కూడా అన్నారు.... అని రవితేజ చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X