బలవంతగా ఆయన వద్దకు కుదరదు: రేణు దేశాయ్ కంటతడి
హైదరాబాద్: 19 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నాను. అయితే అది ఫీషియల్ గా జరుగలేదు. ఎందుకంటే అప్పటికే ఆయనకు(పవన్ కళ్యాణ్) పెళ్లయింది. ఈ విషయం ఆయన నాకు ముందే చెప్పారు. మొదటి భార్యతో విడాకుల కేసు కోర్టులో ఉంది...అది ఎంతకాలం అవుతుందో తెలియదు. అందుకే కలిసి సహజీవనం చేసామని రేణుదేశాయ్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
చాలా మంది ఫ్యాన్స్, శ్రేయోభిలాషులు మళ్లీ వెనక్కి వెళ్లాలని, ఆయనతో కలిసి ఉండాలని అడుగుతున్నారు. కానీ నేను అలా చేయలేను. అలా చేసి ఆయన్ను ఇబ్బంది పెట్టలేను. ఆయన ప్రైవసీకి భంగం కలిగించలేను. మీరంతా అడుగుతున్నారని బలవంతంగా ఆయన దగ్గరకు వెళ్లడం కుదరదు. మీరు వెళ్లమంటే వెళ్లాలా? అయినా ఎక్కడికి వెళ్లాలి? ఇలాంటి సలహాలు ఇచ్చే వారు కూర్చుని ఆలోచించాలి...అంటూ వ్యాఖ్యానించారు రేణు దేశాయ్.

ఆయనతో కలిసి పదేళ్లకుపైగా జీవించాను. ఇద్దరం కలిసి కాపురం చేసాం. మేము ఎందుకు విడిపోయామనే విషయం మా ఇద్దరికి మాత్రమే తెలుసు. ఇప్పటికే నేను చెప్పేది ఒక్కటే...నాది హ్యాపీ మ్యారిడ్ లైఫ్. మేము సెలబ్రిటీలం కాబట్టి ఎందుకు విడిపోయామనే విషయం అందరికీ చెప్పాలని కొంత మంది అడుగుతున్నారు. మేము సెలబ్రిటీలం అయినప్పటికీ మాకు పర్సనల్ లైఫ్ అనేది ఉంటుంది. మా ప్రైవసీకి గురించి కూడా అందరూ ఆలోచించాలి అన్నారు రేణు దేశాయ్.


Click it and Unblock the Notifications