'ఇంటింటా అన్నమయ్య' అందుకే లేటయ్యింది

నిర్మాత మాట్లాడుతూ... వాస్తవానికి ఇంటింటా అన్నమయ్య చిత్రం ఈఏడాది జూన్ 24న విడుదల కావాల్సి ఉందన్నారు. అయితే తెలంగాణ, సీమాంధ్ర ఉద్యమాలు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా జాప్యం జరిగిందని, ఈ క్రమంలో జనవరి చివరి వారంలో విడుదల చేయాలని నిర్ణయించామన్నారు. ఇందుకు సంబంధించిన టీజర్స్‌ను కూడా అద్భుతంగా రూపొందించామని వివరించారు. సాయిబాబా మూవీస్ బ్యానర్‌పై ఆధ్యాత్మిక చిత్రాలను నిర్మిస్తామని, శ్రీ సాయి కృపా మూవీస్ బ్యానర్‌పై సామాజిక విలువలతో కూడిన మంచి చిత్రాలను నిర్మిస్తామని వెల్లడించారు.
భద్రాద్రి రాముని ఆజ్ఞ ఎప్పుడుంటే అప్పుడు మళ్లీ ఆధ్యాత్మిక చిత్రం నిర్మిస్తామన్నారు. కాగా ప్రముఖ రచయిత త్రిపురనేని గోపీచంద్ రచించిన ఒక నవల ఆధారంగా కథను సిద్ధం చేస్తున్నామని, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తరువాత వెల్లడిస్తామని వివరించారు.
అనన్య, సనమ్‌శెట్టి, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, అలీ, తనికెళ్ల భరణి, ఏవిఎస్, జయప్రకాష్‌రెడ్డి, రావురమేష్, పోసాని కృష్ణమురళి, జీవా, సుబ్బరాయశర్మ, గుండు సుదర్శన్, తా.రమేష్, అనంత్, భూషణ్, సుధ, హేమ, జ్యోతిరెడ్డి, శ్యామ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పాటలు: అన్నమయ్య, చంద్రబోస్, కెమెరా: ఎస్.గోపాల్‌రెడ్డి, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, ఎడిటింగ్: శ్రవణ్, కథ: శ్రీసాయిబాబా మూవీస్, మాటలు: అనూరాధ ఉమర్జీ, ఆర్ట్: కిరణ్‌కుమార్, నిర్మాత: యలమంచిలి సాయిబాబు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు.


Click it and Unblock the Notifications











