For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'ఇంటింటా అన్నమయ్య' అందుకే లేటయ్యింది

    By Srikanya
    |
    Intinta Annamayya
    హైదరాబాద్: 'శ్రీరామరాజ్యం' తర్వాత సాయిబాబా మూవీస్ పతాకంపై యలమంచిలి సాయిబాబా నిర్మిస్తున్న చిత్రం 'ఇంటింటా అన్నమయ్య'. కె. రాఘవేంద్ర రావు దర్శకత్వం వహిస్తున్నారు. రేవంత్ హీరోగా పరిచయమవుతున్నాడు. అనన్య, సనంశెట్టి ఇందులో హీరోయిన్లు. ఈ చిత్రాన్నిజనవరి చివరి వారంలో విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ విషయమై నిర్మాత మీడియాకు తెలియచేసారు. ఖమ్మం జిల్లా భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామిని దర్శించుకున్న ఆయన చిత్రం డీవీడీకి సతీసమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

    నిర్మాత మాట్లాడుతూ... వాస్తవానికి ఇంటింటా అన్నమయ్య చిత్రం ఈఏడాది జూన్ 24న విడుదల కావాల్సి ఉందన్నారు. అయితే తెలంగాణ, సీమాంధ్ర ఉద్యమాలు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా జాప్యం జరిగిందని, ఈ క్రమంలో జనవరి చివరి వారంలో విడుదల చేయాలని నిర్ణయించామన్నారు. ఇందుకు సంబంధించిన టీజర్స్‌ను కూడా అద్భుతంగా రూపొందించామని వివరించారు. సాయిబాబా మూవీస్ బ్యానర్‌పై ఆధ్యాత్మిక చిత్రాలను నిర్మిస్తామని, శ్రీ సాయి కృపా మూవీస్ బ్యానర్‌పై సామాజిక విలువలతో కూడిన మంచి చిత్రాలను నిర్మిస్తామని వెల్లడించారు.

    భద్రాద్రి రాముని ఆజ్ఞ ఎప్పుడుంటే అప్పుడు మళ్లీ ఆధ్యాత్మిక చిత్రం నిర్మిస్తామన్నారు. కాగా ప్రముఖ రచయిత త్రిపురనేని గోపీచంద్ రచించిన ఒక నవల ఆధారంగా కథను సిద్ధం చేస్తున్నామని, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తరువాత వెల్లడిస్తామని వివరించారు.

    అనన్య, సనమ్‌శెట్టి, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, అలీ, తనికెళ్ల భరణి, ఏవిఎస్, జయప్రకాష్‌రెడ్డి, రావురమేష్, పోసాని కృష్ణమురళి, జీవా, సుబ్బరాయశర్మ, గుండు సుదర్శన్, తా.రమేష్, అనంత్, భూషణ్, సుధ, హేమ, జ్యోతిరెడ్డి, శ్యామ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పాటలు: అన్నమయ్య, చంద్రబోస్, కెమెరా: ఎస్.గోపాల్‌రెడ్డి, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, ఎడిటింగ్: శ్రవణ్, కథ: శ్రీసాయిబాబా మూవీస్, మాటలు: అనూరాధ ఉమర్జీ, ఆర్ట్: కిరణ్‌కుమార్, నిర్మాత: యలమంచిలి సాయిబాబు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు.

    English summary
    Intinta Annamayya is all set to come to theatres last week of January 2014. This film has Revanth, Ananya, Sanam Shetty in the lead. Raghavendra Rao has directed the film. MM Keeravani has scored the music. The audio release of the film happened in a grand manner in Vizag on 21st March. Revanth is son of Yalamanchali Saibabu, producer of Sri Ramarajyam. This film is a musical love story. The trailer and the songs of the movie gives us a feel that this film is about youth who propagates Annamayya songs.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X