నెట్టింట మార్ఫింగ్ ఫోటోల హల్చల్.. ఇవాంకా ట్రంప్ రియాక్షన్.. ఎంటరైన మెగా మేనల్లుడు

ఇటీవలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన చేసిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో ట్రంప్ తో పాటు ఆయన భార్య మెలానియా, కూతరు ఇవాంకా ట్రంప్ కూడా భాగమయ్యారు. ఈ నేపథ్యంలో భారత సుందరమైన ప్రదేశాల్లో ఇవాంకా ట్రంప్ కొన్ని ఫోటోలు దిగారు. ఈ ఫొటోలను కొందరు మార్ఫింగ్ చేయడం, అవి వైరల్ కావడం జరిగాయి. తాజాగా ఈ ఇష్యూలోకి మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఎంటర్ కావడం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇంతకీ అసలు విషయం ఏంటి? వివరాల్లోకి పోతే..

ఇవాంకా మీదే అందరి కళ్ళు..

ఇవాంకా మీదే అందరి కళ్ళు..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్భంగా.. అందరి కళ్లూ ఆయన కుమార్తె ఇవాంకా మీదే నిలిచాయనడంలో సందేహాలు అక్కర్లేదు. ఆమె ధరించిన దుస్తులు మొదలుకొని పాదరక్షల వరకూ అన్నింటిపై నెట్టింట్లో జోరుగా చర్చ కొనసాగింది. ఈ విషయంలో ట్రంప్ భార్య మెలానియానూ వదిలి పెట్టలేదు నెటిజన్లు. మెలానియా, ఇవాంక ట్రంప్‌ల టూర్ గురించి పెద్ద చర్చే నడిచింది.

 తాజ్ మహల్ వద్ద ఇవాంక ట్రంప్‌.. సైకిల్‌పై కూర్చోబెట్టుకుని

తాజ్ మహల్ వద్ద ఇవాంక ట్రంప్‌.. సైకిల్‌పై కూర్చోబెట్టుకుని

ఈ పర్యటనలో భాగంగా ఇవాంక ట్రంప్‌ తాజ్ మహల్ వద్ద కొన్ని ఫోటోలు దిగింది. ఈ ఫోటోలు చూసిన కొందరు వెంటనే వాటిని మార్ఫింగ్ చేసి.. ఆమె పక్కన తమ తమ ఫొటోలను జోడించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ముఖ్యంగా ఇవాంకను ఓ యువకుడు సైకిల్‌పై కూర్చోబెట్టుకుని తీసుకెళ్తున్నట్టు ఉన్న ఫొటో తెగ వైరల్ అయింది.

సాధారణ పబ్లిక్ తో పాటు సెలబ్రిటీలు కూడా ఆమెతో..

సాధారణ పబ్లిక్ తో పాటు సెలబ్రిటీలు కూడా ఆమెతో..

సాధారణ పబ్లిక్ తో పాటు సెలబ్రిటీలు కూడా ఇవాంక ట్రంప్‌ ఫొటోలను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. బాలీవుడ్‌ హీరో, యాక్టర్, ప్లేబ్యాక్ సింగర్ దిల్జిత్‌ దొసాంజ్‌ ఇవాంకతో ఫొటో దిగినట్లుగా మార్ఫింగ్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.

 మార్పింగ్ పిక్ షేర్ చేస్తూ యాక్టర్ సందేశం.. స్పందించిన ఇవాంకా

మార్పింగ్ పిక్ షేర్ చేస్తూ యాక్టర్ సందేశం.. స్పందించిన ఇవాంకా

ఈ మేరకు ఆ మార్పింగ్ పిక్ షేర్ చేస్తూ యాక్టర్, ప్లేబ్యాక్ సింగర్ దిల్జిత్‌ దొసాంజ్‌.. ''అద్భుతమైన తాజ్‌మహల్‌ వద్దకు నన్ను తీసుకెళ్లినందుకు ధన్యవాదాలు. నేనెప్పటికీ మరిచిపోలేని అనుభవాన్ని నాకు ఇచ్చారు'' అని పేర్కొన్నాడు. దీంతో ఈ ట్వీట్ చూసిన ఇవాంకా అదే ట్విట్టర్ వేదికగా స్పందించింది.

ఇవాంకా రియాక్షన్.. ఇండియాలో

ఇవాంకా రియాక్షన్.. ఇండియాలో

తన మార్ఫింగ్ ఫోటోలు చూసి లైట్‌గా తీసుకున్న ఇవాంకా.. స్పోర్టివ్‌గా స్పందించడం విశేషం. భారతీయుల టాలెంట్‌ను ప్రశంసిస్తూనే.. తనకు భారత్‌లో చాలామంది స్నేహితులు పుట్టుకొచ్చారంటూ రియాక్ట్ అయింది ఇవాంకా.

Recommended Video

ఇవాంకా‌ తో పాటే మంచులక్ష్మి నా ? | Filmibeat Telugu

ఎంటరైన మెగా మేనల్లుడు.. ఆ రియాక్షన్ చూసి!!

ఇలా ఇవాంక స్పందించిన తీరు చూసి మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఎంటరయ్యాడు. ఇవాంకా సెన్సాఫ్ హ్యూమర్‌ను మెచ్చుకుంటూ ట్వీట్ చేశాడు. ''మీరిచ్చిన ఈ రియాక్షన్ మీ లోని సూపర్ సెన్సాఫ్ హ్యూమర్‌ను తెలియజేస్తుంది. నా మాతృభూమి తరఫున మీకు దక్కిన గౌరవం, ప్రేమ ఇవి. ధన్యవాదాలు'' అని తన ట్వీట్ లో పేర్కొన్నాడు సాయి ధరమ్ తేజ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X