క్రేజీ న్యూస్: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ లవ్ బ్రేకప్.. ముద్దులు తట్టుకోలేక

పెళ్లి చూపులు సినిమా వచ్చినప్పుడు చిన్న సినిమానే కదా.. అందులో హీరో హీరోయిన్ల సంగతి మనకెందుకులే అనుకున్నారంతా. ఈ లోగా అర్జున్ రెడ్డి వచ్చింది. దీని విషయంలోనూ సేమ్ టు సేమ్. అయితే ముద్దు సీన్లు, కాంట్రవర్సీలతో అర్జున్ రెడ్డి పెద్ద సెన్సేషన్ కావడంతో విజయ్ దేవరకొండ అందరి కంట్లో పడ్డాడు. అర్జున్ రెడ్డిలో విజయ్ అభినయం చూసి అరే! ఇతను ఆ రోజు పెళ్లిచూపుల్లో చూసిన అబ్బాయే కదా అని అప్పుడు మార్క్ చేసుకున్నారు. అయితే అంతటితో ఆగని ఈ యంగ్ హీరో ఆ తర్వాత గీత గోవిందం, టాక్సీవాలా సినిమాలతో స్టార్ హీరోల సరసన చేరిపోయారు. విజయ్ నటనకు ఫిదా అయిన దర్శకనిర్మాతలు ఆయనకు వరుస అవకాశాలు ఇస్తున్నారు.

ఈ నేపథ్యంలో భరత్ కమ్మ దర్శకత్వంలో డియర్ కామ్రేడ్ సినిమా రూపొందింది. ఈ చిత్రంలో విజయ్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. జులై 26 వ తేదీన ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఇక ఆ తర్వాత ఆయన క్రాంతి మాధవ్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు కమిట్ అయ్యారు. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు విజయ్ తో ముద్దులాట ఆడనున్నారు. అందులో ఒకరు రాశీ ఖన్నా కాగా.. మరో ఇద్దరు ఐశ్వర్య రాజేష్, ఇజబెల్ లేట్. కాగా తాజాగా ఈ సినిమాకు సంబందించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. చిత్రానికి బ్రేకప్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్ చేశారని తెలుస్తోంది. చిత్రంలో ముగ్గురు భామలతో విజయ్ మితిమీరిన రొమాన్స్ చేయడం, ఆ వెంటనే బ్రేకప్ చెప్పేయడం ఈ సినిమాలో ప్రధాన కథాంశం అని తెలుస్తోంది.

Intresting title for Vijay Deverakonda latest movie

అసలే ఒక హీరోయిన్ అంటేనే ముద్దులతో రెచ్చిపోయే విజయ్ దేవరకొండ.. ముగ్గురు హీరోయిన్లు అంటే ఆగుతారా? ఇక ఈసారి ప్రేక్షకులు ముద్దులవానలో తడిసి ముద్దవడం ఖాయం అన్నట్లే. ఇటీవలే విజయ్ దేవరకొండ 'హీరో'గా మరో సినిమా మొదలు పెట్టారు. ఈ చిత్రానికి ఆనంద్ అన్నామలై దర్శకత్వం వహిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X