సల్మాన్ ఖాన్‌తో ఎన్టీఆర్, రామ్ చరణ్.. దద్దరిల్లిపోయే అప్‌డేట్
సినిమా ఇండస్ట్రీలో ఎవరికీ వారు ప్రత్యకమైన హీరోలే. ఒక్కొక్కరిలో ఒక్కో స్పెషల్ టాలెంట్ ఉంటుంది. ఉత్తరాది, దక్షిణాది తారలంతా ఎవ్వరి ఫాలోయింగ్ వారు కూడగట్టుకొని స్టార్ స్టేటస్ సంపాదించారు. అయితే అలాంటి స్టార్ హీరోలు ఒకే తెరపై కనిపించడం, ఒకే వేదికపై చిందులేయడం లాంటివి వారి వారి అభిమాన వర్గాలను కనివిందు చేయడమే గాక, హీరోల అభిమాన వర్గాలందరిలో స్నేహభావం పెంచుతాయి. ఇలాంటి ఓ అరుదైన సంఘటనను కొద్ది రోజుల్లోనే మనం చూడబోతున్నాం. ఆ వివరాలు చూస్తే..

దేశ విదేశాల్లో కండల వీరుడు సల్మాన్
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ దేశ విదేశాల్లో పర్యటనలు చేస్తూ డాన్స్ ప్రదర్శనలు ఇవ్వబోతున్నాడు. దబాంగ్ డాన్స్ టూర్ పేరుతో పర్యటన మొదలు పెట్టిన సల్మాన్.. ముందుగా అరబ్ కంట్రీస్ వెళ్లి, ఆ తర్వాత యూఎస్ఏ వెళ్లబోతున్నాడు. ఆ రెండు దేశాలు చుట్టి వచ్చాక హైదరాబాద్ కూడా రానున్నాడు సల్మాన్ ఖాన్.

ప్రభుదేవా, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ అంతా కలిసి
దబాంగ్ డాన్స్ టూర్ లో భాగంగా సల్మాన్ ఖాన్‌తో పాటు హైదరాబాద్‌కి ప్రభుదేవా, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, సోనాక్షి సిన్హా లాంటి తారలు విచ్చేయనున్నారని సమాచారం. ఈ వేడుక నవంబర్ 2 వ తేదీన జరుగుందని అంటున్నారు. వేదిక దద్దరిల్లేలా డాన్సులు చేసి హైదరాబాద్ జనాన్ని కనువిందు చేయడమే ఈ షో ప్రధాన ఉద్దేశం.

ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా ఎంటరై..
సల్మాన్ ఖాన్ దబాంగ్ టూర్‌లో ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా భాగం కానున్నారనేది తాజా సమాచారం. ఈ వేడుకకు అటెండ్ అయి వేదికపై సల్మాన్ ఖాన్‌తో కలిసి తెగ చిందులేయనున్నారట ఈ ఇద్దరు యంగ్ హీరోలు. సల్మాన్ ఖాన్, ఎన్టీఆర్, రామ్ చరణ్ సినిమా పాటలకు ఈ ముగ్గురూ కలిసి వేసే చిందులు వేదిక దద్దరిల్లడం ఖాయం అనే టాక్ వినిపిస్తోంది.

మెగా ఫ్యామిలీతో సల్మాన్ అనుబంధం.. అందుకే
ముఖ్యంగా మెగా ఫ్యామిలీతో సల్మాన్ ఖాన్‌కి మంచి అనుబంధం ఉంది. ఆయన ఎప్పుడు హైదరాబాద్ విజిట్ చేసినా మెగా ఇంటికి వెళ్లి అందరినీ పలకరిస్తుంటారు. కాబట్టి సల్మాన్ హైదరాబాద్ డాన్స్ టూర్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిందులు స్పెషల్ అట్రాక్షన్ అయ్యేలా ప్రణాళిక రూపొందిస్తున్నారట.

డాన్సుల్లో రారాజులు.. ముగ్గురూ ఒక్కటై
బాలీవుడ్ తెర మీద సల్మాన్, అలాగే టాలీవుడ్ తెరమీద ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు డాన్సుల్లో రారాజులని చెప్పుకోవచ్చు. అలాంటి ఈ ముగ్గురూ కలిసి ఒకేవేదికపై డాన్స్ చేయడం అంటే అంతకన్నా కనువిందు మరొకటి ఉంటుందా? మీరే చెప్పండి.


Click it and Unblock the Notifications











