అన్నింటికీ సిద్ధమైన హీరోయిన్..మెగా హీరోలు ముంచేశారుగా..!

Recommended Video

Lavanya Tripathi Flops Journey Continues

సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠికి కష్టకాలం మొదలైనట్లు ఉంది. ఆమె కెరీర్ ప్రమాదంలో పడే పరిస్థితి ఎదురైంది. అందాల రాక్షసి చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన లావణ్య తొలి చూపులోనే తెలుగువారికి బాగా నచ్చేసింది. ఆ చిత్రంలో అల్లరిపిల్లగా లావణ్య అద్భుతంగా నటించింది. వెంటనే కాకున్నా నెమ్మదిగా లావణ్య కోసం దర్శక నిర్మాతలు ఎగబడ్డారు. కానీ ఇప్పుడు లావణ్య పరిస్థితి పూర్తిగా చతికిల బడింది.

అందాల రాక్షసితో మాయ

అందాల రాక్షసితో మాయ

అందాల రాక్షసి చిత్రంలో సాగే ట్రైయాంగిల్ లవ్ స్టోరీలో లావణ్య ఏమాత్రం తడబడకుండా నటించి మెప్పించింది. తొలిచిత్రంలోనే మంచి నటన కనబరచడంతో దర్శకులంతా ఆమెని చూసి ముచ్చట పడ్డారు.

 తొలి బ్లాక్ బాస్టర్

తొలి బ్లాక్ బాస్టర్

చిత్ర పరిశ్రమలోకి వచ్చిన మూడేళ్ళ తరువాత లావణ్యకు తొలి బ్లాక్ బస్టర్ సక్సెస్ దక్కింది. నాని నటించిన భలేభలే మగాడివోయ్ చిత్రం ద్వారా లావణ్య ఘనవిజయం అందుకుంది. ఆ చిత్రం తిరుగులేనివిజయంతో కలెక్షన్ల వర్షం కురిపించింది.

సోగ్గాడితో రొమాన్స్ అదుర్స్

సోగ్గాడితో రొమాన్స్ అదుర్స్

భలేభలే మగాడివోయ్ చిత్రం తరువాత లావణ్య వెంటనే మరో విజయం దక్కించుకుంది. నాగార్జున సరసన నటించిన సోగ్గాడే చిన్నినాయనా చిత్రం ఎంతటి విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఈ చిత్రంతో లావణ్య లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తరువాత వచ్చిన అల్లు శిరీష్ చిత్రం శ్రీరస్తు శుభమస్తు చిత్రం కూడా పరవాలేదనిపించింది.

 డిజాస్టర్ల పరంపర

డిజాస్టర్ల పరంపర

వరుణ్ తేజ్ తో నటించిన మిస్టర్ చిత్రం నుంచి లావణ్య ఫేట్ పూర్తిగా అడ్డం తిరిగిందని చెప్పొచ్చు. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం భారీ అంచనాలతో విడుదలయింది. కానీ ఫలితం మాత్రం తేడా కొట్టేసింది.

 చైతు, శర్వా కూడా ఆదుకోలేదు

చైతు, శర్వా కూడా ఆదుకోలేదు

లావణ్య నటిస్తూ వచ్చిన చిత్రాలన్నీ మంచి అంచనాలు ఉన్న సినిమాలే. శర్వానంద్ తో నటించిన రాధా, నాగచైతన్యతో నటించిన యుద్ధం శరణం చిత్రాలు కూడా డిజాస్టర్ ఫలితాన్ని ఇచ్చాయి.

హిట్ గ్యారెంటీ అనుకుంటే

హిట్ గ్యారెంటీ అనుకుంటే

నేను శైలజ చిత్రం దర్శకుడు కిషోర్ తిరుమలతో రామ్ చేసిన రెండవ చిత్రం ఉన్నది ఒక్కటే జిందగీ. సూపర్ హిట్ కాంబినేషన్ రిపీట్ అవుతుండడం, పాటలు, ట్రైలర్ ద్వారా మంచి అంచనాలు ఉండడంతో ఈ చిత్రం హిట్ గ్యారెంటీ అని అంతా భావించారు. కానీ ఈ సినిమాకూడా లావణ్యని నిరాశ పరిచింది.

మళ్ళీ మెగా హీరోనే నమ్ముకుంటే

మళ్ళీ మెగా హీరోనే నమ్ముకుంటే

తాజాగా లావణ్య నటించిన చిత్రం ఇంటెలిజెట్. మరో మారు మెగా హీరోనే లావణ్య త్రిపాఠి నమ్ముకుంది. సాయిధరమ్ తేజ్ సరసన నటించిన ఇంటెలిజెంట్ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వివి వినాయక్ ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో కమర్షియల్ సక్సెస్ అవుతుందని అంతా భావించారు. కానీ ఇంటెలిజెంట్ చిత్రానికి తొలి షోనుంచే నెగిటివ్ టాక్ వచ్చేసింది. లావణ్య నమ్ముకున్న మెగా హీరోలిద్దరూ ఈమెని పూర్తిగా నిరాశ పరిచారు.

 తెరవెనక అందాల ఆరబోతకు సిద్ధమైనా

తెరవెనక అందాల ఆరబోతకు సిద్ధమైనా

లావణ్య గత చిత్రాలన్నింటిలో అందాల్ని హద్దులో ఉంచుకుని నటించింది. కానీ ఇంటెలిజెంట్ చిత్రంలో మాత్రం గ్లామర్ షోకు తెరలేపింది. అందాల ఆరబోతకు తాను సిద్దమే అంటూ సంకేతాలు ఇచ్చింది. కానీ ఇంటెలిజెంట్ చిత్రం కూడా పరాజయం చెందడంతో లావణ్యకు టాలీవుడ్ లో గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X