For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బూతు సీన్ల కోసం ఆధార్ టాంపరింగ్: ‘కబీర్ సింగ్’ సాక్షిగా బట్టబయలైన వాస్తవాలు!

|

సినిమాల్లో శృంగారం, అశ్లీలత, హింస, అసభ్యత లాంటి కంటెంట్ ఉన్నపుడు ఇలాంటి చిత్రాలు మైనర్లు చూడకుండా సెన్సార్ బోర్డ్ కఠినమైన నిబంధనలు అమలు చేస్తూ 'A' సర్టిపికెట్ జారీ చేస్తుండటం తెలిసిందే. ఇలాంటి సినిమాలు 18 సంవత్సరాల లోపు వయసున్న పిల్లలు చూడకుండా థియేటర్ల యాజమాన్యాలు అడ్డకోగలుతున్నాయా? ఈ సినిమాలు వారు చూడకుండా ఆపడం సాధ్యం అవుతుందా? అంటే లేదనే చెప్పాలి. తాజాగా విడుదలైన బాలీవుడ్ 'A' రేటెడ్ మూవీ 'కబీర్ సింగ్' విషయంలో చోటు చేసుకుంటున్న కొన్ని పరిణామాలే అందుకు ప్రత్యక్ష సాక్షంగా నిలుస్తున్నాయి.

ఆధార్ కార్డ్ టాంపరింగ్ చేస్తున్న టీనేజర్లు

టీనేజీ వయసున్న పిల్లలు ‘కబీర్ సింగ్' లాంటి చిత్రాలు చూసేందుకు వచ్చినపుడు థియేటర్ల యాజమాన్యాలు ఆధార్ కార్డు ప్రూఫ్ అడుగుతుండటంతో... కొందరు ఆధార్ టాంపరింగ్ చేసి తాము 18 సంవత్సరాలు నిండిన వ్యక్తులుగా చూపిస్తున్నారు. తాజాగా జైపూర్లో ఓ మీడియా సంస్థ నిర్వహించిన ఇన్వెస్టిగేషన్లో ఈ విషయం వెల్లడైంది.

టెక్నాలజీ ఉపయోగించి వయసు మార్చి వేస్తున్నారు

‘నేను, నా ఫ్రెండ్ మా ఆధార్ కార్డులను మొబైల్ యాప్ ద్వారా ఫోటోలు తీసి.... తమ పుట్టిన తేదీ, సంవత్సరం మార్చివేసి దాన్ని ప్రింట్ తీయించి చూపిస్తున్నామని, థియేటర్ల యాజమాన్యం తమను 18 సంవత్సరాలు నిండిన వ్యక్తులుగా నమ్మి లోనికి పంపిస్తున్నారు.' అంటూ ఆకాష్(పేరు మార్చబడింది) ఐఏఎన్ఎస్ వార్త సంస్థకు వెల్లడించారు.

బుక్ మై షో ద్వారా చేశాం... ఎవరూ ప్రూఫ్ అడగటం లేదు

మరో స్టూడెంట్ యువరాజ్(పేరు మార్చబడింది) మాట్లాడుతూ... ‘‘మేము బుక్ మై షో ద్వారా బల్క్ టికెట్లు బుక్ చేశాం. దీంతో మా ఏజ్ గురించి ఎవరూ అడగలేదు. ఆన్ లైన్ టికెట్లు చూపించగానే ‘కబీర్ సింగ్' సినిమా చూడటానికి అనుమతించారు'' అని తెలిపారు.

వారిని గుర్తించడం కష్టంగా మారుతుంది

'A' రేటెడ్ సినిమాలు ప్రదర్శితం అయినపుడు టిక్కెట్ల మీద కూడా ఇది పెద్దలకు మాత్రమే పరిమితమైన సినిమా అని ముద్రిస్తాం. కానీ కొన్ని సందర్భాల్లో 18 సంవత్సరాలు నిండని వ్యక్తులను గుర్తించడం కష్టంగా మారుతుంది. ఆధార్ కార్డు ప్రూఫ్ చెక్ చేసి లోకిని పంపుతున్నాం. స్టూడెంట్స్ ఫేక్ కార్డులు చూపిస్తున్న విషయం తమకు తెలియదు' అని ఐనాక్స్ థియేటర్ చైన్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

కబీర్ సింగ్

తెలుగులో సూపర్ హిట్ అయిన ‘అర్జున్ రెడ్డి' చిత్రాన్ని హిందీలో షాహిద్ కపూర్, కియారీ అద్వానీ జంటగా ‘కబీర్ సింగ్' పేరుతో రూపొందించిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో శృతి మించిన శృంగార సీన్లు, ముద్దు సీన్లు, డ్రగ్స్, మద్యం సేవించే సన్నివేశాలు ఉండటంతో ఇది పెద్దలకు మాత్రమే పరిమితమైన ‘A' సినిమాగా సర్టిఫై చేశారు.

English summary
In a blatant misuse of technology, teenagers in Jaipur have been found faking their age on their Aadhar Cards just to watch A-rated Bollywood flick "Kabir Singh".The Shaheed Kapoor-starrer is going superhit in cinema halls across the country. But given its "adult" certification, those below the age of 18 cannot watch the film. That's hardly a problem though. "My friends and I clicked pictures of our Aadhar Cards and edited them on a mobile app to change my date of birth. No one stopped us at the theatre entrance and we managed to watch the film," Aakash (name changed) told IANS.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more