IPL 8: ప్రారంభ వేడుకల్లో పాల్గొనే హీరో,హీరోయిన్స్
హైదరాబాద్: క్రికెట్ అభిమానులను కనువిందు చేయడానికి ఏప్రిల్ 8న నుంచి ఐపీఎల్ సీజన్-8 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆరంభ వేడుకలకు బాలీవుడ్ తారాగణం హృతిక్ రోషన్, షాహిద్‌కపూర్, ఫర్హాన్ అక్తర్, అనుష్కశర్మ తదితరులు తమ ఆటపాటలతో అలరించనున్నారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
ఈ నెల 7న కోల్‌కతాలో ఈ ప్రారంభ వేడుకలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... సీజన్-8 ఆరంభ వేడుకలకు వ్యాఖ్యాతగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ వ్యవహరిస్తారని పేర్కొన్నారు.

అంతేకాకుండా అభిమానుల ఉత్సాహాన్ని పెంచే విభిన్న వినోద కార్యక్రమాలు చాలా ఉన్నాయని ఆయన అన్నారు. గత సీజన్ ఛాంపియన్స్ అయిన కోల్‌కత నైట్‌రైడర్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ తిరిగి ట్రోఫీని స్డేడియంలోకి తీసుకురానున్నారు.
ప్రపంచకప్ టోర్నీని ఆస్వాదించిన క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ రూపంలో మరో సరికొత్త క్రీడా సంగ్రామం స్వాగతం చెపుతోంది. ఏప్రిల్ 8న ప్రారంభమయ్యే ఐపీఎల్ మే 24న ముగుస్తుంది. మొత్తం 60 మ్యాచ్‌లతో ఆసాంతం కనుల విందు చేయడానికి మీ ముందుకు వస్తోంది.


Click it and Unblock the Notifications











