క్రికెట్ దొంగ వ్యాపారం..చర్య తీసుకోవాలి: శివాజీ
ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ ల ప్రభావం సినిమాలపై పడుతోందని, ఐపియల్ కమిషనర్ లలిత్ మోడీ పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలవి హీరో శివాజీ అన్నారు..క్రికెట్ ను తాము ప్రేమిస్తామని అయితే 2012 సంవత్సరం లోపు ప్రభుత్వమే లలిత్ మోడీని అరెస్టు చేస్తారని జోశ్యం చెప్పారు. ఇక ఐపీఎల్ క్రికెట్ ఒక దొంగ వ్యాపారం అని ఆయన వ్యాఖ్యానించారు అన్నారు. తాజ్ మహల్ చిత్రం నిర్మాత ఆయన ఆ చిత్రం ఏ విధంగా నడుస్తుందో చూడటానికి ఆదివారం కర్నూలుకు వచ్చారు. ఆయనతో పాటు నటులు చిత్రం శ్రీను, రామచంద్ర కూడా ఉన్నారు. తొలుత ఆనంద్ సినీ కాంప్లెక్స్ యజమాని ప్రభాకర్ తో కలసి చిత్రం కలెక్షన్ ఏ విధంగా ఉందో తెలుసుకున్నారు. సినిమా హాలులోకి వెళ్లి ప్రేక్షకులను పలకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియాతో ఆయన మాట్లాడుతూ తాజ్ మహల్ సినిమాను ప్రజలు బాగా ఆదరిస్తున్నారన్నారు. తనకు బాగా నచ్చిన సినిమా మంత్ర అని తెలిపారు. అవకాశం వస్తే దశవతారాలను వేయాలని ఉందని తెలిపారు.


Click it and Unblock the Notifications











