‘బాద్‌షా’ కలెక్షన్లపై ఐపీఎల్ ఎఫెక్ట్!
హైదరాబాద్ : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన 'బాద్ షా' చిత్రం ఈ రోజు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ డే సినిమాకు భారీ ఓపెనింగ్స్ వస్తాయని నిర్మాతలు అంచనా వేస్తుండగా......ఒక ముఖ్యమైన కారణం ఓపెన్సింగ్స్‌పై ఎఫెక్ట్ చూపుతుందేమోననే ఆందోళన సైతం వారిని వెంటాడుతోంది.
ఈ రోజు 'బాద్ షా' విడుదలవుతుంగా....మరో వైపు హైదరాబాద్‌లో 'సన్ రైజర్స్-పూణె వారియర్స్' ఐపీఎల్ మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే ఐపీఎల్ ఫీవర్ ఎక్కువగానే ఉంది. మ్యాచ్ చూసేందుకు అంతా టీవీలకు అతుక్కుపోతే ఓపెనింగ్ కలెక్షన్స్ పై ప్రభావం చూపే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఐఫీఎల్ టోర్నీ మరో నెల రోజులకు పైగా సాగనున్న నేపథ్యంలో ఓవరాల్ కలెక్షన్లపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందంటున్నారు.
కాగా...'బాద్‌షా' ఈ రోజు ఉదయం 5.09 గంటలకే ఓవర్సీస్(ప్రీమియర్ షోలు)తో పాటు ఇండియాలో(బెన్ ఫిట్ షోలు)నూ విడుదలైంది. విడుదలైన ప్రతి చోట సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. సినిమా పూర్తి వినోదాత్మక చిత్రమని, శ్రీను వైట్ల గత సినిమాలతో కాస్త పొలికలు ఉన్నప్పటికీ ఆద్యంతం ఫుల్లీ లోడెడ్ ఎంటర్టెన్మెంట్‌గా ఉందనే టాక్ వినిపిస్తోంది.
'బాద్ షా' చిత్రాన్ని బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించారు. ఎన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్ నటించగా, తమన్ సంగీతం అందించారు. దర్శకుడు శ్రీను వైట్ల 'బాద్ షా' చిత్రాన్ని ఫుల్లీలోడెడ్ ఎంటర్ టైన్మెంట్స్ ఎలిమెంట్స్ తో రూపొందించారు. ఈ చిత్రానికి థమన్, కె.వి.గుహన్, గోపీమోహన్, కోనవెంకట్, ఎ.ఎస్.ప్రకాష్, ఎంఆర్ వర్మ, చలసాని రామారావు సాంకేతిక వర్గం. సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీను వైట్ల.


Click it and Unblock the Notifications











