»   » చూస్తుంటే ‘బూతు’లా ఉంది, కానీ డైరెక్టర్ వాదన మరోలా ఉంది... (ఫోటోస్)

చూస్తుంటే ‘బూతు’లా ఉంది, కానీ డైరెక్టర్ వాదన మరోలా ఉంది... (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'ఇప్పట్లో రాముడిలా సీతలా ఎవరుంటారండి బాబు' అనే టైటిల్ తో తెలుగులో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ప్రజంట్‌ అమ్మాయిలు , అబ్బాయిలు ఎలా ఉంటున్నారనే అంశంతో వారి లైఫ్‌ స్టైల్‌ని తెరపై ఆవిష్కరిస్తూ సహజత్వానికి దగ్గరగా ఉండేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని అంటున్నారు దర్శకుడు వెంకటేష్‌.కె.

యూత్‌ఫుల్‌ రొమాంటిక్ స్పైసీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలోప్రశాంత్‌ ,మహీధర్‌, లలిత , ఇషితా హీరో హీరోయిన్లుగా నటించారు. బేబీ ఆముక్త సమర్పణలో ప్రశ్నార్ద్‌ తాతా నిర్మించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదల సన్నాహాల్లో ఉంది.

ఇప్పటి వరకు విడుదలైన సినిమా పోస్టర్లు చూసి, స్టిల్స్ చూసిన వారంతా ఇదో బూతు సినిమా అనే నిర్ణయానికి వచ్చారు. అయితే దర్శకుడు మాత్రం దీన్ని రొమాంటిక్‌ క్రైమ్‌ స్పైసీ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దాం అని చెబుతున్నారు. ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి దర్శకుడు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి.

 `ఇప్పట్లో రాముడిలా సీతలా ఎవరుంటా రండీ బాబు' ఈ టైటిల్‌ పెట్టడానికి రీజన్‌?

`ఇప్పట్లో రాముడిలా సీతలా ఎవరుంటా రండీ బాబు' ఈ టైటిల్‌ పెట్టడానికి రీజన్‌?

కథానుసారంగా ఈ టైటిల్‌ పెట్టాను. సినిమా చూస్తే ఈ సినిమాకు టైటిల్‌ పర్‌ఫెక్ట్‌ యాప్ట్‌ అని మీరే అంటారు.

 కథ గురించి వివరిస్తారా?

కథ గురించి వివరిస్తారా?

ఇద్దరు కాలేజ్‌ స్టూడెంట్స్‌ లక్సరీ లైఫ్‌ కు అలవాటు పడి చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటారు. కొంత మంది అమ్మాయిలు, ఆంటీల వీక్‌నెస్‌ పట్టుకొని వారికి మాయ మాటలు చెప్పి వలలో వేసుకుంటారు. వారితో రొమాన్స్‌ చేయడమే కాకుండా వారి దగ్గర డబ్బు, నగలు దోచుకుంటుంటారు. ఈ క్రమంలో వీళ్లలో ఒక్కొక్క లేడీ వరుసగా హత్య చేయబడుతుంటారు. అసలు ఈ హత్య ఎవరు? ఎందుకు? చేస్తున్నారన్నది చిత్ర కథాంశం. ఇంటర్‌వెల్‌ సీన్‌, క్లైమాక్స్‌ సీన్‌ ఇంత వరకు తెరపై చూడని విధంగా ఉంటుంది. అందుకే దీన్ని రొమాంటిక్‌ క్రైమ్‌ స్పైసీ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దాం.

 ఈ కథ వెనకా రియల్‌ ఇన్సిడెంట్స్‌ ఏమైనా ఉన్నాయా?

ఈ కథ వెనకా రియల్‌ ఇన్సిడెంట్స్‌ ఏమైనా ఉన్నాయా?

కథ కల్పితమే కాకుంటే, సీన్స్ కానీ, పాత్ర స్వభావం కానీ నిత్యం మనం చూస్తున్నవే ఉంటాయి. ఒక్క మాటలో చెప్పా లంటే రోడ్డు మీద కుర్రాళ్లు ఎలా మాట్లాడు కుంటారో,. ఎలా బిహేవ్‌ చేస్తుంటారో అలాగే సినిమా అంతా నేచరల్‌గా ఉంటుంది. నేను ఏదైనా నేచరల్‌గా ఉండటానికే ఇష్టపడతాను. ఇక మీదట కూడా ఇలాంటి సహజ సిద్ధమైన కథతో సినిమాలు చేస్తాను.

 ఈ సినిమా ద్వారా ఏమి చెబుతున్నారు?

ఈ సినిమా ద్వారా ఏమి చెబుతున్నారు?

మనం మెసేజ్‌లు ఇస్తే తీసుకునే పొజిషన్‌ లో ఇక్కడ ఎవరూ లేరన్నది నా అభిప్రాయం. కాబట్టి ఎలాంటి మెసేజ్‌ లు మా సిననిమాలో లేవు. రొమాన్స్‌కు, అలవాటు పడిన అమ్మా యిులు , అబ్బాయిలు చివరకు ఎలా క్రైమ్‌లో ఇరుకుంటున్నారు అన్నది చూపించాను. ఇందులో ప్రేమ ఉంది. దానికి తాలూకు పెయిన్‌ ఉంది. ఆల్‌ కమర్షియల్‌ యాంగిల్స్‌ ఉన్నాయి.

మీ నిర్మాత గురించి చెప్పండి?

మీ నిర్మాత గురించి చెప్పండి?

ప్రశ్నార్త్‌ తాతా గారు ఈ చిత్రాన్ని నిర్మించారు. నాకు మంచి మిత్రుడు. తనకు కథ నచ్చి వెంటనే ఫైనల్‌ చేశారు. ఎన్ని ఆటంకా లు ఎదురైనప్పటికీ సినిమాను ఏ విషయంలో రాజీ పడకుండా చాలా రిచ్‌గా నిర్మించారు. సినిమా పట్ల ఎంతో పాషన్‌ ఉన్న వ్యక్తి.

 ఇటీవ విడుదలైన పాటకు రెస్పాన్స్‌ ఎలా ఉంది?

ఇటీవ విడుదలైన పాటకు రెస్పాన్స్‌ ఎలా ఉంది?

రమేష్‌.డి అనే కొత్త మ్యూజిక్‌ డైరక్టర్‌ని పరిచయం చేస్తున్నాం. 4 సూపర్బ్‌సాంగ్స్‌ ఇచ్చారు. ఇటీవల విడుదలైన పాటకు, టీజర్‌కు సోషల్‌ నెట్‌వర్క్స్‌లో ట్రెమండస్‌ రెస్పాన్స్‌ భిస్తోంది. ఇక జోష్యభట్ల గారు చేసిన నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిుస్తుందని చెప్పాలి.

 మీ తొలి సినిమాగా ఇలాంటి బోల్డ్‌ సబ్జెక్ట్‌ ఎన్నుకోవడానికి రీజన్‌?

మీ తొలి సినిమాగా ఇలాంటి బోల్డ్‌ సబ్జెక్ట్‌ ఎన్నుకోవడానికి రీజన్‌?

నాకు ఇలాంటి నేచరల్‌ సబ్జెక్ట్స్‌ చేయడం అంటే ఇష్టం. అందుకే చేశాను. ఇక మీదట కూడా చేస్తాను. నాకు తెలిసి రొమాన్స్‌లో అన్ని భావో ద్వేగాలు ఉంటాయి. ఇందులో కూడా లవ్‌ ఉంది, క్రైమ్‌ ఉంది. ఎమోషన్‌ ఉంది. యాక్షన్‌ ఉంది. కామెడీ ఉంది. ఎవరూ చేసిన వీటిని బేస్‌ చేసుకుని సినిమా చేయాల్సిందే. గన్‌ పట్టిన వాడైనా, ఫ్యాక్షనిస్టైనా ఫైనల్‌గా రొమాన్స్‌ చేస్తాడు కాబట్టి ..రొమాంటిక్‌ సబ్జెక్ట్‌ ఎంచుకున్నా. నాకు ఈ సినిమా ఎలాంటి పేరు తెస్తుందో చెప్పలేను కానీ, ప్రజంట్‌ నడుస్తున్న ట్రెండ్‌ ఎలా ఉందో కళ్లకు కట్టినట్లు చూపించాడీ దర్శకుడు అని చూసిన ప్రతి ఒక్కరూ అనుకుంటారు.

 సెన్సార్‌ వారి టాక్‌ ఎలా ఉంది?

సెన్సార్‌ వారి టాక్‌ ఎలా ఉంది?

ఈ చిత్రంలో పతాకస్థాయిలో రొమాన్స్‌ ఉన్న కారణంగా ‘ఏ' సర్టిఫికెట్‌ ఇచ్చారు. చిన్నచిన్న కట్స్‌, మ్యూట్స్‌ చెప్పారు. సినిమా ఏదో బోల్డ్‌గా తీయాలని తీయలేదు. కథానుసారంగా అలా తీయాల్సి వచ్చింది కాబట్టి తీసాను.

 మీ సినిమా స్టిల్స్‌, టీజర్‌ చూసిన వాళ్లు బాలీవుడ్‌ మహేష్‌భట్‌ సినిమాల్లా ఉందంటున్నారు? మీ కామెంట్‌?

మీ సినిమా స్టిల్స్‌, టీజర్‌ చూసిన వాళ్లు బాలీవుడ్‌ మహేష్‌భట్‌ సినిమాల్లా ఉందంటున్నారు? మీ కామెంట్‌?

మా సినిమా కూడా బాలీవుడ్‌ డైరెక్టర్‌ మహేష్‌భట్‌ సినిమా తరహాలో ఫుల్‌ రొమాంటిక్‌గా ఉంటుందన్న మాట వాస్తవమే. నాకు తెలిసి ఇంత బోల్డ్‌గా తొగులో ఫుల్‌లెన్త్‌ శృంగార భరిత చిత్రం రావటం ఇదే మొదటిసారి. యూత్‌ని బాగా ఆకర్షించే చిత్రం. నిజంగా బాలీవుడ్‌ డైరక్టర్‌ తో పోలిస్తే సంతోషమే. ఎందుకంటే మహేష్‌ భట్‌గారు ఎలాంటి డైరక్టరో అందరికీ తెలిసిందే.

 మీ తదుపరి చిత్రం?

మీ తదుపరి చిత్రం?

ఈ సినిమాను మార్చిలో విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం. నా కొత్త సినిమా కూడా మార్చిలోనే ప్రారంభిస్తాను. త్వరలో దానికి సంబం ధించిన పూర్తి వివరా లు వ్లెడిస్తానన్నారు యువ దర్శకుడు వెంకటేష్‌ కె.

English summary
Prashanth Mahidhar, Lalitha Ishitha starrer Ippatlo Ramudila Sithala Yevaruntarandi Babu movie director Venkatesh K interview.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu