Don't Miss!
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- News
అమెరికాలో మరోసారి కాల్పులు: ముగ్గురు మృతి, నలుగురికి తీవ్రగాయాలు
- Sports
పని పాట లేని వెదవలు క్రియేట్ చేసే స్టోరీలు.. బాబర్ నాకు కొడుకుతో సమానం: వసీం అక్రమ్
- Finance
air india: చరిత్ర సృష్టించనున్న ఎయిర్ ఇండియా.. ప్రపంచంలో అలా చేస్తున్న మొదటి సంస్థ టాటానే..
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
Taraneh Alidoosti: ఆస్కార్ అవార్డు మూవీ నటి అరెస్ట్.. ఆమె ఏం పోస్ట్ చేసిందో తెలిస్తే!
ఇరాన్ దేశంలో హిజాబ్ ధరించలేదని మాషా అమినీ(22) అనే యువతిని మోరాలిటీ పోలీసులు అరెస్ట్ చేయడం.. ఆ సమయంలో ఆమె కోమాలోకి వెళ్లడం.. ఆ తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన విషయాలు తెలిసిందే. అప్పటి నుంచి ప్రభుత్వానికి, ఇస్లామిక్ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు మొదలయ్యాయి. మరీ ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలే ఆస్కార్ అవార్డు గెలిచిన మూవీ నటి చేసిన ఓ పోస్ట్ దుమారాన్ని రేపింది. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సంగతులు మీకోసం!

ప్రభుత్వం చర్యలు తీసుకున్నా
మాషా అమినీ మరణం తర్వాత ఇరాన్ దేశం అట్టుడుకుతోంది. అక్కడి మహిళలు స్వచ్చందంగా బయటకు వచ్చి జుట్టు కత్తిరించుకుంటూ, హిజాబ్‌లను తగలబెడ్తూ రోజూ నిరసనలు తెలియజేస్తున్నారు. దీంతో నిరసనకారులపై ఇరాన్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. లాఠీ చార్జ్‌లతో పాటు కొన్ని చర్యలు తీసుకుంటోంది. అయినా అక్కడి మహిళలు మాత్రం తగ్గడంలేదు.
గ్లామర్ కంచె తెంచేసిన కాజల్: డెలివరీ తర్వాత తొలిసారి యమ హాట్‌గా!

ఉరిశిక్షలు.. బహిరంగంగా శిక్ష
ఇరాన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా అక్కడ మాత్రం హిజాబ్ వ్యతిరేక పోరాటాలు తగ్గడం లేదు. దీంతో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే చాలా మందికి ఉరిశిక్షలు విధించింది. అయినా తగ్గకపోవడంతో ఇటీవలే మొహ్సేన్ షెకారీ (23) అనే వ్యక్తిని ఇరాన్ ప్రభుత్వం బహిరంగంగా ఉరి తీసింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా హెడ్‌లైన్ అయింది.

ఆస్కార్ నటి పోస్టుతో కలకలం
మొహ్సేన్ షెకారీ (23) అనే వ్యక్తిని ఇరాన్ ప్రభుత్వం బహిరంగంగా ఉరి తీయడంపై.. ఆ దేశానికి చెందిన తరనేహ్ అలిదూస్తీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. అందులో 'ఇలాంటి రక్తపాతాన్ని చూసి ఎలాంటి చర్యలు తీసుకోని అంతర్జాతీయ సంస్థలు ఉండడం మానవత్వానికి అవమానకరం' అంటూ రాసుకొచ్చింది. దీంతో ఒక్కసారిగా అంతటా కలకలం రేగింది.
అఖండ హీరోయిన్ హాట్ సెల్ఫీ: ఓర్నాయనో ఆ డ్రెస్సేంటి బాబోయ్!

నటిని అరెస్ట్ చేసిన పోలీసులు
హిజాబ్‌కు వ్యతిరేకంగా జరుగుతోన్న పోరాటాలకు మద్దతు తెలపడంతో పాటు ఇరాన్ ప్రభుత్వం విధిస్తోన్న ఉరిశిక్షలను వ్యతిరేకిస్తూ పోస్ట్ చేయడంతో నటి తరనేహ్ అలిదూస్తీ స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని ఇరాన్ మీడియా శనివారం వెల్లడించింది. ఇక, తరనేహ్ అలిదూస్తీ అరెస్ట్ వార్తతో ఆమె ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. దీంతో ఈ న్యూస్ హైలైట్ అయింది.

అందుకే అరెస్ట్ అని క్లారిటీ
ఇరాన్‌కు చెందిన ప్రముఖ నటి తరనేహ్ అలిదూస్తీని అరెస్ట్ చేసిన తర్వాత అక్కడి పోలీసులు మీడియాకు కీలక విషయాలను వెల్లడించారు. అందులో 'ఆమె తప్పుడు సమాచారంతో కూడిన, ప్రభుత్వ నిర్ణయాలను వక్రీకరించే కంటెంట్‌ను పోస్ట్ చేశారు. దీంతో దేశంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అందుకే ఆమెను అదుపులోకి తీసుకున్నాం' అని చెప్పుకొచ్చారు.
Bigg Boss Winner: షో చరిత్రలోనే చెత్త నిర్ణయం.. బిగ్ బాస్ పెద్ద పొరపాటు.. రేవంత్, శ్రీహాన్‌కు షాక్

తరనేహ్ అలిదూస్తీ గురించి
చిన్న వయసు నుంచే తరనేహ్ అలిదూస్తీ ఇరానీ భాషలో ఎన్నో సినిమాల్లో నటించింది. ఈ క్రమంలోనే 2016లో వచ్చిన 'ది సేల్స్‌మాన్' అనే చిత్రంలో నటించింది. ఈ మూవీకి గతంలో ఆస్కార్ అవార్డు కూడా లభించింది. ఇక, ఇటీవలే తరనేహ్ అలిదూస్తీ 'లీలాస్ బ్రదర్స్' అనే సినిమాలో నటించింది. ఇది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితం కూడా అయింది.