twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'వైట్ బెలూన్' దర్శకుడికి 6 యేళ్ళ జైలు, 20 యేళ్ళ బ్యాన్

    By Srikanya
    |

    వైట్ బెలూన్, మిర్రర్, ది సర్కిల్ వంటి ప్రపంచ ప్రఖ్యాత సినిమాల రూపొందించిన దర్శకుడు జాఫర్ పనాహి ఇరాన్ సినిమాలు చూసే వారికే సుపరిచితుడే. రీసెంట్ గా ఆయకి ఇరాన్ కోర్టు ఆరు సంవత్సరాల పాటు జైలు శిక్ష, ఇరవై సంవత్సరాల సినిమాలు తీయరాదని, స్క్రిప్టు కూడా రాయకూడదని బ్యాన్ పెట్టారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడన్న ఆరోపణపై ఇరాన్ సర్కారు ఈ శిక్ష విధించింది.

    నలభై తొమ్మిది సంవత్సరాల పనాహి..ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయటంలో, మద్దతును కూడగట్టటంలో సర్కారు వ్యతిరేక శక్తులతో కుమ్మక్కయ్యారన్న ఆరోపణలను విచారించిన ఇరాన్ కోర్టు పనాహీని దోషిగా నిర్ధారించినట్లు ఆయన తరఫు న్యాయవాది ఫరీదా ఘెరాత్ వెల్లడించినట్లు ది గార్డియన్ వార్తా పత్రిక తెలిపింది. ఇందుకుగాను ఆయనకు ఆరేళ్ల జైలుశిక్ష విధించటంతో పాటు..20 ఏళ్ల పాటు ఎలాంటి సినిమాకు దర్శకత్వం వహించటం కానీ, నిర్మించటం కానీ, స్క్రిప్ట్ రాయటం కానీ, విదేశాలకు ప్రయాణం చేయటం కానీ, మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వటం కానీ చేయరాదని నిషేధం విధించింది.

    గత ఏడాది వివాదాస్పదమైన ఇరాన్ అధ్యక్ష ఎన్నికల అనంతరం జరిగిన నిరసనల్లో పోలీసు కాల్పుల్లో మరణించిన వారి సంతాప కార్యక్రమంలో పాల్గొన్నందుకు పనాహీని 2009 జూలైలో అరెస్ట్ చేశారు. కొద్ది రోజులకే ఆయనను విడిచిపెట్టినా.. దేశం విడిచి వెళ్లేందుకు అనుమతి నిరాకరించారు. మళ్లీ ఈ ఏడాది ఫిబ్రవరిలో పనాహీని, ఆయన కుటుంబ సభ్యులను, సహచరులను కూడా అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్‌ను మార్టిన్ స్కోర్సెసె, స్టీవెన్ స్పీల్‌బర్గ్, ఫ్రా న్సిస్ ఫోర్డ్ కొప్పోలా, జూలియెట్ బినోచె వంటి హాలీవుడ్ ప్రముఖులు ఖండిం చారు.

    పనాహీ రూపొందించిన తొలి సినిమా ది వైట్ బెలూన్ కు 1995లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కెమరా డి ఓర్ అవార్డును గెలుచుకున్నారు. 2000లో ద సర్కిల్ సినిమాకు గోల్డెన్ లయన్ అవార్డును సొంతం చేసుకున్నారు. 2009 లో సైతం ఇరాన్ ఎన్నికల సందర్భంగా జరిగిన అన్యాయాలను, అక్రమాల గురించి ఒక సినిమా రూపొందించే ప్రయత్నంలో ఉండగా పోలీసులు ఆయన్ని అరెస్టు చేసారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X