సినీ కెరీర్ సెట్ చేసుకుంటున్న భారత క్రికెటర్.. స్వయంగా ప్రకటన.. స్టార్ హీరోతో కలిసి!

Recommended Video

Irfan Pathan Set To make Acting Debut In Tamil Movie Starring Chiyaan Vikram

భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లు వెండితెర బాట పడుతుండటం సినీ లోకంలో ఆసక్తికర అంశంగా మారింది. ఇప్పటికే బౌలర్ శ్రీశాంత్ సినిమాల్లో నటిస్తుండగా, ఆ బాటలో మరో పేస్‌ బౌలర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ కూడా చేరిపోయాడు. తాను సినిమాల్లో నటించబోతున్నానని ఆయనే స్వయంగా ప్రకటించాడు.

వెండితెరపై భారత స్టార్ పేస్‌ బౌలర్‌

వెండితెరపై భారత స్టార్ పేస్‌ బౌలర్‌

భారత స్టార్ పేస్‌ బౌలర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ వెండితెరపై అరంగేట్రం చేయబోతున్నాడు. తమిళ 'చియాన్‌' విక్రమ్‌తో కలిసి త్వరలో ఓ సినిమాలో ఇర్ఫాన్‌ పఠాన్‌ నటించబోతున్నాడు. తమిళ యువ డైరెక్టర్ అజయ్‌ ఙ్ఞానముత్తు దర్శకత్వంలో విక్రమ్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంతో ఇర్ఫాన్‌ రెండో ఇన్నింగ్స్‌ మొదలు పెట్టనుండటం హాట్ టాపిక్ అవుతోంది.

 ఇర్ఫాన్‌ పాత్ర ఇదే..

ఇర్ఫాన్‌ పాత్ర ఇదే..

ఈ సినిమాలో తాను ఏ పాత్ర పోషించనున్నది ఇర్ఫాన్‌ వెల్లడించలేదు. కానీ.. టర్కీకి చెందిన పోలీసు అధికారి పాత్రలో ఇర్ఫాన్‌ పఠాన్‌ కనిపించనున్నాడని సమాచారం. విక్రమ్‌ నటించే 58వ సినిమా ఇది. ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీతం అందించనున్న ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందనుంది. ఇర్ఫాన్‌ పఠాన్‌ను వెండితెరకు పరిచయం చేస్తున్నందుకు గర్వంగా ఉందని నిర్మాణ సంస్థ సెవెన్‌ స్ర్కీన్‌ స్టూడియో ట్వీట్‌ చేసింది.

విక్రమ్‌ గెటప్స్.. ప్రపంచ రికార్డుకు సిద్ధం

ఙ్ఞానముత్తు ఇదివరకు డిమొంటే కాలనీ, ఇమైక్క నొడిగల్‌ సినిమాలను తెరకెక్కించాడు. మూడో చిత్రంలోనే అగ్ర హీరో విక్రమ్‌తో కలిసి పనిచేయనున్నాడు. ఈ చిత్రానికి ఇంకా టైటిల్‌ను ఖరారు చేయలేదు. ఈ సినిమాలో విక్రమ్‌ 25 గెటప్స్‌లో కనిపించనున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఒకవేళ విక్రమ్‌ 25 గెటప్స్‌లో కనిపిస్తే.. ఒకే సినిమాలో అత్యధిక పాత్రలను పోషించిన నటుడిగా విక్రమ్‌ ప్రపంచ రికార్డును నెలకొల్పుతాడు.

సరికొత్త ప్రయాణం.. వేగం పెంచుతాడా మరి?

సరికొత్త ప్రయాణం.. వేగం పెంచుతాడా మరి?

2003లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌తో ఇర్ఫాన్‌ పఠాన్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఆరంగేట్రం చేశాడు. భారత్‌ తరఫున ఇప్పటి వరకు 102 వన్డేలు, 29 టెస్టులు, 24 టీ20లు ఆడాడు. చివరగా 2012లో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20లో ఆడాడు. ఫామ్ కోల్పోయిన ఇర్ఫాన్‌.. భారత జట్టులో చోటు కోల్పోయాడు. ఇక వెండితెర ప్రయాణానికి సిద్దమయ్యాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X