»   » మహేష్ బాబు అభిమానుల ఆందోళన, ట్రాఫిక్ జామ్.... ఏం జరిగిందంటే?

మహేష్ బాబు అభిమానుల ఆందోళన, ట్రాఫిక్ జామ్.... ఏం జరిగిందంటే?

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానుల ఆందోళన, నినాదాలతో లక్డీకాపూల్ అమరావతి థియేటర్ ప్రాంతం బుధవారం ఉదయం దద్దరిల్లింది. అభిమానులు నిరసన వ్యక్తం చేస్తూ రోడ్డుపైకి చేరడంతో అక్కడ కాసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

మహేష్ బాబు ‘ఫస్ట్ ఓథ్‌’పై సినీ స్టార్ల స్పందన..!
థియేటర్ వద్ద షూటింగ్

థియేటర్ వద్ద షూటింగ్

మహేష్ బాబు నటిస్తున్న ‘భరత్ అనే నేను' చిత్రం షూటింగ్ లక్డీకాపూల్‌లోని అమరావతి థియేటర్లో జరిగింది. ఇక్కడ సినిమాకు సంబంధించిన కొన్ని యాక్షన్ సీన్లు షూట్ చేశారు.

 భారీగా చేరుకున్న అభిమానులు

భారీగా చేరుకున్న అభిమానులు

మహేష్ బాబు సినిమా షూటింగ్ సంగతి తెలుసుకున్న అభిమానులు ఇక్కడికి భారీ సంఖ్యలో చేరుకున్నారు. అయితే లోనికి వెళ్లేందుకు సెక్యూరిటీ సిబ్బంది వారిని అనుమతించలేదు. ఒక్కసారి మహేష్ బాబును కలిసి వెళ్లిపోతామని చెప్పినా సిబ్బంది వినలేదు.

 మహేష్ బాబు అసిస్టెంటు కోటిపై ఆగ్రహం

మహేష్ బాబు అసిస్టెంటు కోటిపై ఆగ్రహం

ఘట్టమనేని అభిమాన సంఘం రాష్ట్రస్థాయి నేతలు రావడంతో మహేష్ బాబు పర్సనాల్ అసిస్టెంట్ పరుచూరి కోటి వారి వద్దకు వచ్చి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. సినిమా షూటింగులో బాబు బిజీగా ఉన్నారని, ఇపుడు కలవడం కుదరదని వారిని అడ్డుకున్నారు. దీంతో అభిమానులు కోటిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

 అభిమానులను కలవకుండానే వెళ్లిన మహేష్ బాబు

అభిమానులను కలవకుండానే వెళ్లిన మహేష్ బాబు

పిఏ కోటి తీరుపై అభిమానులు థిటయేర్ గేటు ముందు నిరసన తెలిపారు. షూటింగ్ ముగిసిన వెంటనే మహేష్ బాబు మరియు యూనిట్ సిబ్బంది మరో దారిలో అభిమానుల కంట పడకుండా వెళ్లిపోయారు.

English summary
Hero Mahesh Babu's 'Bharat Ane Nenu' movie shooting of few fighting scenes were held at Amaravati Theatre in Lakdikapul today morning. The enthusiastic fans are eager to meet Mahesh Babu and pose for a selfie. But, Mahesh Babu’s Personal Assistant Paruchuri Koti had denied as Mahesh was busy with the shoot.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu