నాన్న మరణిస్తే రిక్షాలో వేసి ఈడ్చుకెళ్లారు.. ఐరెన్ లెగ్ శాస్త్రి కుమారుడి కంటతడి

By Rajababu

Recommended Video

Iron Leg Sastry Son Serious Comments On His Father's Situation

ఐరన్ లెగ్ శాస్త్రి అంటే హాస్యానికి చిరునామా. హావభావాలతోనే ఆయన ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. కెరీర్ మంచి రేంజ్‌లోనే ఉండగానే ఆయనకు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దాంతో ఆయన అర్ధాంతరంగా ఈ లోకం నుంచి వెళ్లిపోయారు. ఐరెన్ లెగ్ శాస్త్రి మరణానికి సంబంధించిన విషయాలను ఆయన కుమారుడు ప్రసాద్ వెల్లడించారు. తన తండ్రి మరణం తర్వాత ఎదురైన పరిస్థితులను తలచుకొని ఉద్వేగానికి లోనయ్యారు. ఆయన ఏమన్నారంటే..

ఆస్తులు కూడబెట్టుకోలేకపోయారు..

ఆస్తులు కూడబెట్టుకోలేకపోయారు..

మా నాన్న ఐరెన్ లెగ్ శాస్త్రి చాలా సినిమాల్లో నటించినా పెద్దగా ఆస్తులు కూడబెట్టుకోలేకపోయారు. అవకాశాలు తగ్గడంతో హైదరాబాద్ నుంచి మా సొంత ఊరు తాడేపల్లిగూడెంకు వెళ్లాం. అక్కడే సొంత ఇంట్లోనే మా నాన్నగారు ఉండేవారు. మేమే హైదరాబాద్‌లో ఉండేవాళ్లం.

 చివరి చూపు, మాటకు దూరంగా

చివరి చూపు, మాటకు దూరంగా

మా కుటుంబం పౌరహిత్యంపై ఆధారపడటంతో కష్టంగా ఉండేది. శరీరం భారీగా పెరిగిపోయింది. ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. అలాంటి పరిస్థితుల్లో మా నాన్నకు గుండెపోటు వచ్చింది. మేము ఆ సమయంలో హైదరాబాద్‌లో ఉన్నాం. వెంటనే మా బంధువులు హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. ఆ రాత్రి మేము ట్రైన్ ఎక్కాం. అదే రాత్రి ఆయన కన్నుమూశారు. చివరి చూపు, మాట చూసుకోలేకపోయాం అని ప్రసాద్ అన్నారు.

 అమ్మ కళ్లు తిరిగి కిందపడి..

అమ్మ కళ్లు తిరిగి కిందపడి..

మేము ట్రైన్ దిగి హాస్పిటల్‌కు వెళ్తున్నాం. ఎదురుగా రిక్షాలో మా నాన్న పార్ధీవ దేహం. కేవలం బాడీ మాత్రమే రిక్షాలో ఉంది. తల, కాళ్లు, చేతులు రిక్షా బయట వేలాడుతూ ఉన్నాయి. అలా మా నాన్నను రిక్షాలో లాక్కెల్లడం చూసి మా అమ్మ కళ్లు తిరిగి కింద పడిపోయారు.

 చాలా కష్టాలు పడ్డాం

చాలా కష్టాలు పడ్డాం

మా నాన్న‌కు ఆదరణ ఆయన పోయిన తర్వాతే మాకు తెలిసింది. మీడియా అంతా వచ్చింది. మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ సభ్యులు మా ఇంటికి వచ్చారు. మాకు సహాయం చేశారు. మా నాన్న మరణం తర్వాత చాలా కష్టాలు అనుభవించాం. మా నాన్న సోదరి అంటే మా అత్తగారు చాలా సహాయం అందించారు. మా కుటుంబాన్ని అంతా పోషించారు. మాకు ఎడ్యుకేషన్ కోసం ఖర్చు చేశారు. వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం.

 కాదంబరి కిరణ్‌ సహాయం

కాదంబరి కిరణ్‌ సహాయం

మా నాన్న గారు మరణించిన తర్వాత ఆర్థికంగా చాలా సమస్యలు ఎదుర్కొన్నాం. నటుడు సంపూ, దర్శకుడు కాదంబరి కిరణ్ కుమార్ మమ్మల్ని బాగా ఆదుకొన్నారు. నేను సీఎ చదువుకోవడానికి ఆయనే కారణం. కోచింగ్‌లకు ఆయన డబ్బులిచ్చారు. ఆయనను కలిసి కాళ్లకు దండం పెట్టుకొంటాను అని జూనియర్ ఐరెన్ లెగ్ శాస్త్రి తెలిపారు.

జంబలకిడి పంబలో నటిస్తున్నా

జంబలకిడి పంబలో నటిస్తున్నా

ప్రస్తుతం మా కుటుంబాన్ని హైదరాబాద్‌కు షిఫ్ట్ చేశాం. ప్రస్తుతం మల్కాజిగిరిలో ఉన్నాం. ప్రస్తుతం సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నాను. మా నాన్న లెగసీని కంటిన్యూ చేయాలని అనుకొంటున్నాను. ప్రస్తుతం జంబలకిడి పంబ చిత్రంలో నటిస్తున్నాను. మా నాన్నకు కూడా ఆ చిత్రం మంచి బ్రేక్ ఇచ్చింది. అలాంటి చిత్రం ద్వారానే నేను సినిమా పరిశ్రమలోకి రావడం చాలా ఆనందంగా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X