twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏజెంట్లు లేకుండా అక్కడ సినిమా అవకాశాలు కష్టమే!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ తరచూ పలు భారీ హాలీవుడ్ సినిమాల్లో కనిపించడం చూస్తూనే ఉన్నాం. ‘స్లమ్ డాగ్ మిలియనీర్' చిత్రంలో నటించిన ఆయన ఇతర హాలీవుడ్ భారీ ప్రాజెక్టులైన లైఫ్ ఆఫ్ పై, ది అమేజింగ్ స్పైడర్ మేన్, జురాసిక్ వరల్డ్ చిత్రాల్లోనూ నటించారు.

    ప్రస్తుతం ఆయన నటిస్తున్న హాలీవుడ్ చిత్రం ‘ఇన్‌ఫెర్నో'. రాన్ హోవార్డ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. తన హాలీవుడ్ అనుభవాల గురించి మీడియాతో ముచ్చటిస్తూ... ఏజెంట్లు లేకుండా హాలీవుడ్ లో మనుగడ సాగించడం కష్టమని తెలిపారు. అలా అని ఏజెంట్లను నియమించుకుంటే ఇక లైఫే మారిపోతుందని కాదు. ఓ ఏజెంట్ సాయం లేకుండా హాలీవుడ్ లో మనం ఏమీ చేయలేం. ఫోనెత్తి నేరుగా ఫిలిం మేకర్లతో మాట్లాడే పరిస్థితి ఉండదు అన్నారు.

    Irrfan Khan about Hollywood agents

    ఓ ఏజెంట్ ను ఏర్పాటు చేసుకుని, అతడి ద్వారానే ప్రయత్నాలు సాగించాలి. తప్పదు, ఆ వ్యవస్థలో భాగం కావాల్సిందే. లేకపోతే ఏ పనీ కాదు. అయితే, ఏజెంట్ ను నియమించుకున్నంత మాత్రాన అవకాశాలు వచ్చిపడతాయనుకోవడం పొరబాటే అవుతుంది. అతడో మధ్యవర్తి మాత్రమే. అవకాశాలు సృష్టించలేడు. ఎక్కడన్నా అవకాశం ఉందని తెలిస్తే, దానికి సంబంధించిన డీల్ కుదర్చగలడు అన్నారు.

    ఆయన తాజాగా నటిస్తున్న హాలీవుడ్ మూవీ ‘ఇన్‌ఫెర్నో' సినిమా విషయానికొస్తే... ఇదే థ్రిల్లర్ ఫిల్మ్. కొలంబియా పిక్చర్స్ వారు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో ఇర్ఫాన్ ఖాన్ హ్యారీ అనే పాత్రలో నటిస్తున్నారు. ఈచిత్రంలో ఆయన ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.

    English summary
    'Piku' actor Irrfan Khan is one of the few Hindi film actors who has been able to land roles in Hollywood. He says agents ease the process of survival in the West, but it doesn't mean that life gets transformed by merely having an agent.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X