ఐశ్వర్యారాయ్ తాజా చిత్రం తెలుగు డబ్బింగ్ (పొస్టర్)

By Srikanya

ముంబై: చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఐశ్వర్యరాయ్ త్వరలో ‘జజ్బా' సినిమా ద్వారా మళ్లీ రీ ఎంట్రీ ఇస్తోంది. ఆమె సంజయ్ గుప్తా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ లో బిజీగా ఉంటోంది. ఇందులో ఐశ్వర్యరాయ్, ఇర్ఫాన్ ఖాన్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయే విధంగా ఉంది. ఈ చిత్రంలో ఐష్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతోంది. ఈ చిత్రాన్ని తెలుగులో లాయిర్ అనురాధ వర్మ అనే టైటిల్ తో డబ్బింగ్ చేసారు.

కెమెరాకి దూరమైనంత మాత్రాన కళాకారుల ప్రతిభ కనుమరుగవ్వదని ఓ ఆర్టిస్ట్‌ ఎప్పటికీ ఆర్టిస్టేనని అంటోంది ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌. ఐదేళ్ల విరామం తర్వాత ఆమె నటించిన జజ్బా శుక్రవారం విడుదల కానుంది.

ఈ సందర్భంగా ఐశ్వర్య మీడియాతో ముచ్చటిస్తూ.. 'చాలా కాలం తర్వాత సినిమాలో నటించారు కదా మళ్లీ కెమెరా ముందుకు రావడం ఎలా అనిపిస్తోందంటూ చాలా మంది అడుగుతున్నారు. ఓ ఆర్టిస్ట్‌ జీవితంలో ఇలాంటివి సహజమే. కళాకారులైనవారు జీవితకాలం కళాకారులుగానే ఉంటారు.

Irrfan Khan & Aishwarya Rai Bachchan Jazbaa telugu poster

ఎంత గొప్ప నటులైనా సాధారణంగా ఏడాదికి రెండు లేదా ఒక సినిమానే చేస్తుంటారు. జజ్బా ఐదేళ్ల కిత్రం చేసుంటే చాలా భిన్నంగా ఉండేది. కానీ ఇప్పుడు నేనూ ఓ తల్లినే, అందుకే అనురాధ వర్మ పాత్రని అర్థం చేసుకుని చెయ్యగలిగాను' అంటూ చెప్పుకొచ్చింది ఐశ్వర్య. దక్షిణకొరియా చిత్రం 'సెవెన్‌డేస్‌'ను హిందీలో జజ్బాగా రీమేక్‌ చేశారు.

ఇందులో ఆమె సింగిల్ మదర్, క్రిమిల్ లాయర్ గా కనిపించబోతున్నారు. ఈ సినిమా పెర్ఫార్మెన్స్ పరంగా ఐశ్వర్యరాయ్ కి మంచి పేరు తెచ్చి పెడుతుందని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు. ఇందులో ఆమె పలు యాక్షన్ సన్నివేశాల్లో కూడా నటించింది. విభిన్న కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఐశ్వర్యరాయ్ తో పాటు ఇర్ఫాన్ ఖాన్, షబానా అజ్మి, అనుపమ్ ఖేర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎస్సెల్ విజన్ ప్రొడక్షన్స్ ప్రై.లి. వైట్ ఫాదర్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అక్టోబర్ 9 నాటికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా కోసం ఐశ్వర్యరాయ్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X