తీవ్రమైన క్యాన్సర్‌తో భాదపడుతూ కూడా.. వైరల్ అవుతున్న నటుడి ఫోటో!
ప్రముఖ బాలీవడ్ నటుడు ఇర్పాన్ ఖాన్ క్యాన్సర్ వ్యాధితో భాదపడుతున్న సంగతి తెలిసిందే. క్యాన్సర్ తో పోరాడుతూ లండన్ లో చికిత్స చేయించుకుంటున్నాడు. క్యాన్సర్ ప్రభావం ఇర్ఫాన్ పై ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఇర్ఫాన్ ఖాన్ తన ట్విట్టర్ లో డీపీని చేంజ్ చేశారు. ఆ ఫోటోలు బాగా బక్కచిక్కి, నీరసంతో ఇర్ఫాన్ ఖాన్ కనిపిస్తున్నారు.
అంతటి తీవ్రమైన వ్యాధితో భాదపడుతూ కూడా ఇర్ఫాన్ ఖాన్ ముఖంలో చిరునవ్వు చెదరలేదు. ఈ పిక్ నెటిజన్లని ఆకర్షిస్తూ వైరల్ గా మారింది. శరీరంలో భయంకరమైన వ్యాధి ఉన్నాఆయన మనోధైర్యానికి ఇది నిదర్శనం అని నెటిజన్లు అంటున్నారు.

ఇర్ఫాన్ ఖాన్ కు క్యాన్సర్ వ్యాధి ఉన్నట్లు మార్చి నెలలో నిర్ధారణ అయింది. ఆ సమయంలో ఇర్ఫాన్ ఖాన్ బాగా ఎమోషనల్ అయ్యారు. ఇర్ఫాన్ అభిమానులు, సినీ ప్రముఖులంతా ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.


Click it and Unblock the Notifications











